అటవీ రక్షణ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రేంజర్ శ్రీనివాసరావు ( FRO) కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ. ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర్ రావు గారు శ్రీనివాస రావు భార్య భాగ్యలక్ష్మి కి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగ నియామక ఉత్తర్వులు వేదిక పై అందించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మేము ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయాము. మాకు కుటుంబ పెద్దగా, తండ్రిగా సీఎం కేసీఆర్ అండగా నిలిచారు, మమ్మల్ని ఆదుకున్నారు, ఇప్పటికే ఇంటి స్థలం మరియు ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. మా కుటుంబం తరపున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు.