తెలంగాణలో సాదా బైనామాలకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తామని, పేదలను కాపాడడంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని వరల్డ్ బ్యాంకు, యూఎన్వో తో పాటు పలు సంస్థలు చెప్పాయని సీఎం గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో డబ్బులు వసూలు చేసేవారు.. తాము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సాదా బైనామాలు చేపట్టామని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియలో 1,19,000 దరఖాస్తులు తీసుకుని 6,18,000 ఎకరాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేశామన్నారు.
ఎమ్మెల్యేల కోరిక మేరకు సాదా బైనామాలను గతంలో మూడు సార్లు పొడిగించాం. మరోసారి అవకాశం ఇవ్వాలని పలువురు సభ్యులు కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి అవసరమైతే 15 రోజులు సమయం ఇచ్చి అవకాశం ఇస్తాం. పేదలకు తాము ఎప్పుడూ అన్యాయం చేయలేదు. కేబినెట్ చర్చ పెట్టి సాదాబైనామాల కోసం సానుకూల నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని సీఎం తెలిపారు.