mt_logo

నేటి నుండి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు

నేడు మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో అధినేత సీఎం కేసీఆర్ పర్యటించి పలు ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా.. తొలుత అశ్వరావుపేట నియోజకవర్గ పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం దమ్మపేటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 

తదుపరి బూర్గంపాడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు చెందిన ప్రజలనుద్దేశించి అధినేత ప్రసంగిస్తారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా నర్సంపేటలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.