mt_logo

బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ భవితకు భరోసా.. ఇదే జనం అభిప్రాయం

ఈనెల 30న జరుగనున్న తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో పెద్ద ఎత్తున చర్చలు, విశ్లేషణలు, అభిప్రాయాల సేకరణ, గ్రౌండ్ రిపోర్టింగ్, సర్వేలు ఇలా భిన్నరూపాలలో జరుగుతున్నాయి. నిజంగా ఈ సర్వేలు, అభిప్రాయ సేకరణ, మౌఖిక ప్రచారాలు వాస్తవరూపం దాల్చుతాయా అనేవి ఓటరు మెదడులో తిరుగుతున్నాయి.

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని విశ్లేషిస్తే, క్రింది స్థాయి వరకు వెళ్లిన ప్రభుత్వ పథకాలైన ఆసరా పింఛనులు, రైతు బంధు , రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, రెసిడెన్షియల్ పాఠశాలలు, 24 గంటల ఉచిత విద్యుత్, సంక్షేమ కార్యక్రమాలను పొందుతున్న లబ్దిదారులు కేసీఆర్ పాలన పట్ల సంతోషంగా ఉన్నారు. దళిత బంధు ప్రవేశం ద్వారా షెడ్యూల్డ్ కులాల వారిలో కూడా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. దశలవారిగానైనా అందరికీ దళిత బంధు వస్తుందనే నమ్మకం వారిలో ఉంది. అదేవిధంగా బంజారా, ఆదివాసీలు కూడా తమకు పోడు భూములపై శాశ్వతాధికారం దక్కడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతతో ఉన్నారు. 

ఇక, ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ పధకం కాళేశ్వరంకు కొద్దిగా ఇంజనీరింగ్ సమస్యలు తలెత్తడంతో, ఈ మొత్తం ప్రాజెక్టుని కూల్చివేయాలనే కాంగ్రెస్, బీజీపీల ప్రచారాలను తెలంగాణా ప్రజానీకం ఏమాత్రం ఖాతరు చేయలేదు. పైగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలోని చెరువుల్లో సమృద్ధిగా నీళ్లు, పారే కాలువలు గ్రామీణుల కంట కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఏమాత్రం ప్రజలు విశ్వసించడంలేదు. 

ఇక, నియామకాలపై నిరుద్యోగ యువతను రెచ్చగొట్టడంలో రేవంత్ రెడ్డి బ్యాచ్ కొంత సఫలీకృతమైన.. ఇదే సమయంలో పార్టీకి గత ఏడెనిమిది ఏళ్లుగా సేవచేస్తున్న ఉస్మానియా నాయకులలో ఏ ఒక్కరికీ సీట్ ఇవ్వకపోవడంతో యువత ఆ పార్టీకి దూరమవుతున్నారు. యువతకే సీటివ్వని రేవంత్ రెడ్డి బ్యాచ్ రానున్న కాలంలో నియామకాల్లో చొరవ చూపిస్తుందనే భ్రమలు, నమ్మకం పూర్తిగా తొలగిపోయాయి.

నామినేషన్ల అనంతరం యువతలోనూ కాంగ్రెస్ పార్టీపట్ల భ్రమలు తొలగిపోయాయని చెప్పవచ్చు. పైగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తార్నాకలోని బార్లలో బీర్లు తాగి బిర్యానీలు తినేందుకు డబ్బులకోసం వస్తారని రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలు కూడా యువతలో ఆగ్రహావేశాలు కలిగించాయి.

ఇలా.. ఏవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల విశ్వసనీయత చూపడంలేదు.అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు, ప్రస్తుతం ఉన్న రైతు బంధు , రైతు బీమా, ఉచిత విధ్యుత్ సరఫరా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛనులు మరింత సమర్థవంతంగా అమలు కావాలంటే, కేసీఆర్ నాయకత్వంలోని సుస్థిర ప్రభుత్వంతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నారు. 

కేసీఆర్ నాయకత్వంపై విషం చిమ్మేలా, అప్రజాస్వామిక భాషలో తిడుతూ, తమ ప్రసార మాధ్యమాల్లో రేవంత్ రెడ్డి బ్యాచ్  ప్రచారం చేస్తున్నప్పటికీ, వీటిని తెలంగాణా ప్రజానీకం ఏమాత్రం నమ్మడంలేదనే చెప్పవచ్చు. 

నవంబర్ 30 తేదీన జరిగే ఎన్నికల్లో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణా తెచ్చిన పార్టీకే ఓటువేసి, తమ అస్తిత్వాన్ని మరోసారి దేశంలో చాటాలని దృఢ సంకల్పంతో తెలంగాణా ఓటర్లున్నారని పరిణితి చెందిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.