mt_logo

అర్చకుల గౌర‌వ వేతనం రూ. 6 వేల నుంచి రూ. 10 వేల‌కు పెంచుతూ జీవో జారీ

అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం క్రింద గౌర‌వ వేత‌నాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు  జారీ  చేసినందుకు సీయం కేసీఆర్ కు  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఉమ్మ‌డి పాల‌న‌లో  అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య  పథకం కింద రూ.2,500  మాత్ర‌మే అందేవని,  అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించిన సీయం కేసీఆర్….. రూ.2500  గౌర‌వ‌ వేత‌నాన్ని రూ, 6,000  పెంచార‌ని అన్నారు. 

ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామ‌ని సీఎం కేసీఆర్  ప్రక‌టించి, ఇప్పుడు దానిని రూ 10,000 కు పెంచార‌ని పేర్కొన్నారు.  వేతనం పెంపును సీఎం కేసీఆర్‌ ప్రకటించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమ‌న్నారు.  

గ‌తంలో 1805 ఆల‌యాల‌కు మాత్ర‌మే ధూప దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లు చేస్తే  ద‌శల వారీగా  ఈ ప‌థ‌కాన్ని మ‌రిన్ని ఆల‌యాల‌కు వర్తింప‌ చేస్తున్నామని పేర్కొన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 6,541 దేవాల‌యాల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లు  చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ధూప దీప నైవేద్య పథకానికి సంవత్సరానికి రూ.78. 49 కోట్లు  వ్యయం అవుతుందని చెప్పారు.