mt_logo

నాంపల్లి అగ్నిప్రమాదం పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్: నాంపల్లి బజార్ ఘాట్‌లో బారి అగ్ని ప్రమాదం సంభవించింది. 9 మంది మృతి చెందారు. గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కెమికల్ గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. 

నాంపల్లి అగ్నిప్రమాదం పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.