mt_logo

రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద నిర్మించిన మేథా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని రూ.1,000 కోట్లతో మేధా గ్రూప్‌ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనున్నది. రైల్‌ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా నిలువనున్నది. కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎ కేసీఆర్‌ కర్మాగారంలో మిషన్లను పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు వాటి పనితీరును సీఎంకు వివరించారు.