mt_logo

ముంచిన కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ ఆగమాగం: సీఎం కేసీఆర్

  • కాంగ్రెస్ దద్దమ్మల మాటలు నమ్మకండి
  • పాలమూరు పాలుగారే బంగారు తునకగా మారుతుంది

ముంచిన కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ ఆగమాగం అవుతాడన్నారు సీఎం కేసీఆర్ జడ్చర్ల ఆశీర్వాద సభలో  బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లా గత ఉద్యమ సందర్భంలో  ఏ మూలకు పోయినా , ఏ ప్రాంతానికి పోయినా ఎప్పుడు కూడా   దు:ఖంతో పోయేది. కండ్లల్లో నీళ్లొచ్చేదన్నారు.  ఏరోజుకైనా మహబూబ్‌నగర్ చరిత్రలో కీర్తి ఉంటుంది. 15 ఏండ్లు పోరాటం చేసినప్పటికీ నేను మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉంటూనే తెలంగాణను సాధించిన కీర్తి  స్థిరస్థాయిగా మహబూబ్‌నగర్‌కు ఉంటుంది.

ఒక గోస కాదు మహబూబ్‌నగర్‌ది

జయశంకర్ గారు నేను నారాయణ పేట ప్రాంతం పోయి హైదరాబాద్‌కు వెళ్లడానికి నవాబ్ పేట మీదుగా అటవి గుండా వస్తున్నాం. అక్కడ అటవిని చూసి జయశంకర్ నేను అనుకున్నం. మనుషులు కాదు చివరికి అడవి కూడా బక్క పడిపోయిందని సన్నగా ఉన్న చెట్లను చూసి బాధపడ్డామన్నారు. ఒక గోస కాదు మహబూబ్‌నగర్‌ది. అనేక సందర్బాల్లో కండ్లకు నీళ్లొచ్చేది. నేను నడిగడ్డకు పోయిన రోజు కూడా ఒక ఊర్లో  ఏడ్చినం, మహబూబ్‌నగర్‌లో గంజి కేంద్రాలు పెడుతుంటే, అంబలి కేంద్రాలు పెడుతుంటే  గుండెలవిసేలాగా మాకు బాధ కలిగేది.  ఏం దుర్గతి  కృష్ణానది పక్కనుంచే పారుతున్నా అవకాశాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం , నాటకాలాడటం, శిలాఫలాకాలెయ్యడం తప్ప ఆంధ్రప్రదేశ్‌లో లాభం జరుగలేదు. 

డయాలసిస్ సెంటర్లు  లక్ష్మారెడ్డి పుణ్యమే

ఉద్యమంలో పాట కూడా నేనే రాసిన. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే,పాలమూరు నల్లగొండ ఖమ్మం మెట్టు పంటలెండె అని రాశానని తెలిపారు. మహబూబ్‌నగర్‌ నా గుండెల్లో ఉంటది. ఇక్కడ దు:ఖం ఎక్కువ ఉంటుంది. బాధ ఎక్కువగా ఉంటుంది. పేదరికం ఎక్కువగా ఉన్నదన్నారు. మొట్టమొదటి ప్రభుత్వం వచ్చాక లక్ష్మారెడ్డి సహచరుడిగా కేబినెట్ మంత్రిగా ఉండె. వైద్యశాఖ మంత్రిగా ఉండి చాలా పనులు చేసినాడు.ఇయ్యాల వచ్చిన డయాగ్నిసిస్ సెంటర్లు. డయాలసిస్ సెంటర్లు  లక్ష్మారెడ్డి పుణ్యమే అని పేర్కొన్నారు. 

ఎవడో ఇవ్వలే తెలంగాణ 

తెలంగాణ ఎవ్వరూ పుక్కానికి ఇవ్వలే. అనేకమందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, చాలా బాధలు పెట్టి చివరకు  నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావునోట్లో తలకాయపెడితే తప్ప తెలంగాణ రాలేదు. ఎవడో ఇవ్వలే తెలంగాణ అన్నారు. పుక్కానికి వచ్చి ఎవడూ తెలంగాణను ఇవ్వలే. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్సు. 60 ఏండ్లు గోసపోసుకుని  మనం బొంబాయి పోయేటట్టు  కూలీ పనేటట్టు, వలస పోయేటట్టు పోసింది కాంగ్రెస్ పార్టీ. మళ్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్లే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మనమే పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం. ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు, కాంగ్రెస్ నాయకులు  కేసులు వేస్తున్నారు. అడ్డం పడ్తున్నారు. అది కావద్దని, అది పూర్తయితే లక్ష్మారెడ్డికి పేరు వస్తది.  శ్రీనివాస్ గౌడ్‌కు పేరు వస్తది, జిల్లా ఎమ్మెల్యేలకు పేరు వస్తది. 

కేసీఆర్‌కు పేరు వస్తాదని దానికి అడ్డగాతులు పెట్టినారు. అయినప్పటికీ మొండి పట్టుదలతో పోయినం. ఈ మధ్యనే  తొమ్మిది సంవత్సరాల పోరాటం తర్వాత అనుమతులన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తున్నది. ధర్మం గెలుస్తది, న్యాయం గెలుస్తది . మొన్ననే పాలమూరు  ఎత్తిపోతల పథకం ప్రారంభం చేసినాను. దానిమీద రావాల్సిన నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండపూర్ కావచ్చు. రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యాయి. టన్నెల్స్ అన్ని కంప్లెంట్ అయిపోయినయి. మోటర్లన్నీ బిగుస్తున్నారు.

జడ్చర్లను పరిశ్రమల కేంద్రంగా, ఐటీ హబ్‌గా.. 

రాబోయే రెండు మూడు నెలల్లో అన్ని రిజర్వాయర్లల్లో నీళ్లు కండ్ల చూడ బోతున్నాం అని తెలిపారు. పాలమూరు కరువు అనేది పోతది,  ఉద్దండాపూర్ కంప్లీట్ అయితే జడ్చర్ల యొక్క క్యారెక్టర్  ఏంటంటే ఓక కొసకు కరివెన ఉంటుంది. నెత్తి మీద నుంచి  ఉద్దండాపూర్ ఉంటది. రెండు మూడు నెలల్లో జడ్చర్ల నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కరువు అనేది మన దిక్కు  కన్నెత్తి కూడా చూడదు. సస్యశ్యామలమైన అద్భుతమైన తాలుకా తయారైతది. హైదరాబాద్ సమీప ప్రాంతం జడ్చర్ల. శంషాబాద్ నుంచి 40 నిమిషాలే తొవ్వ 60 కిలోమీటర్ల దూరమే ఉన్నది. లక్ష్మారెడ్డి పోలేపల్లి సెజ్ తెచ్చినారు. చాలా మంది ఉద్యోగాలు దొరికినాయి. పరిశ్రమల కేంద్రంగా , ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నా. మొదట మంచినీళ్ల బాధ పోవాలని మిషన్ భగీరథ పెట్టుకున్నాం. ప్రతి  ఇంటికి నల్లా నీళ్లు వస్తున్నాయని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి , నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్  కంప్లీట్ చేసుకున్నామన్నారు.  పాలమూరు ఎత్తిపోతల ఎంబడి పడ్డాం. 90 శాతం పూర్తయింది. 10 శాతం త్వరలో పూర్తి కాబోతుంది. అనుమతులు వస్తున్నాయి. పాలమూరు పూర్తయితే  పాలుగారే జిల్లాగా బంగారు తునకగా మారుతది. అద్భుతంగా మారుతుందని చెప్పారు.

కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం, దళితబంధుకు జై భీం

కర్ణాటకలో ఎన్నికల ముందు 20 గంటల కరెంటు ఇస్తానన్నారు. ఇప్పుడు 5 గంటలు ఇస్తామంటున్నారు. కర్ణాటక రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులో ఉన్నది కక్కిండు . 3 గంటలు చాలట విద్యుత్ సరఫరా. 24 గంటలు కావాలా? 3 గంటలు కావాలా? అని అడిగారు. కాంగ్రెస్ వస్తే కరెంటును కాటగలుపుతరు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం, దళితబంధుకు జై భీం, మస్తుగ చెప్తరు ఎన్నికలు వచ్చాయి కాబట్టి అడ్డం పొడుగు మాట్లాడారు. భారత దేశం మొత్తంలో 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. లక్ష్మారెడ్డి కోరిన పోలీసు స్టేషన్లు ఎన్నికల తెల్లారే జీవో తీసి ఇస్తాను.ఉద్దండాపూర్  ప్రాజెక్టులో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

నేను రాజీనామా చేసిన నాడు ఆయన కూడా చేసిండు. ఉద్యమం ఆసాంతం నా వెంబడి ఉన్న నిఖార్సయిన నాయకుడు లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని అర్థమైపోతావుంది. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వాల్యానాయక్ తండాలో పడుకున్న. 52 తండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. లంబాడి తండాల్లో వాళ్లకే రాజ్యం వచ్చింది. మీరందరూ దీవించాలని కారుగుర్తుకు ఓటు వేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.