mt_logo

ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది: సీఎం కేసీఆర్

ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం మాట్లాడుతూ… ప్రధాని మోదీ వ్యవసాయ మీటర్లకు మీటర్లు పెట్టకపోతే బడ్జెట్‌లో రూ.5000 కోట్లు తగ్గిస్తామని తనను హెచ్చరించారని చెప్పారు. తన తల తెగిపడినా ఆ పని చేయనని చెప్పినట్లు తెలిపారు. మరెన్నో మంచి పనులు చేశామని, రైతుల ఇబ్బందులు తొలగించడానికి ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. 

మంచి ప్రభుత్వం వస్తే మంచి పనులు జరుగుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నిక‌ల్లో ఓటును అల‌వోక‌గా వేయొద్దు.. మీ త‌ల‌రాత మార్చేది..  భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఇల్లందు చాలా ఉద్య‌మాలు జ‌రిగిన ప్రాంతం.. చాలా చైత‌న్యం ఉండే ప్రాంతం.. పోరాటాల పురిటిగ‌డ్డ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎల‌క్ష‌న్లు వ‌చ్చిన‌ప్పుడు పార్టీకి ఒక‌రు నిల‌బ‌డుతారు. బీఆర్ఎస్ త‌ర‌పున హ‌రిప్రియ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ త‌ర‌పున ఎవ‌రో ఒక‌రు నిల‌బ‌డుతారు, న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌రిగేది ఖాయం.. డిసెంబ‌ర్ 3న‌ ఎవ‌రో ఒక‌రు గెలిచేది ఖాయం.

పైస‌ల‌కు, ప్ర‌లోభాల‌కు ఓటు వేయొద్దు

స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏండ్లు గుడ‌స్తుందన్నారు. రాజ‌కీయ ప‌రిణితి, ప్ర‌జాస్వామి ప‌రిణితి రావాల్సిన అస‌వ‌రం ఉందని తెలిపారు. ఇది గంభీర‌మైన స‌మ‌స్య‌. ఒక ఒర‌వ‌డిలో కొట్టుకుపోకుండా, పైస‌ల‌కు, ప్ర‌లోభాల‌కు ఓటు వేయొద్దని సూచించారు. మీరు ఆలోచించి చైత‌న్యంతో నిజ‌మేదో ఆలోచించి ఓటు వేయాలి.  ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గెలిచే స్థితి రానంత వ‌ర‌కు ఈ దేశం ఇలానే ఉంట‌దని కేసీఆర్ అన్నారు. మీ శ‌క్తి లేక‌పోతే మేం చేసేది ఏం లేదు,  మీలో ఒక‌డిగా, కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్య‌క్తిగా చెబుతున్నానని పేర్కొన్నారు.  అభ్య‌ర్థి వెనుక ఉన్న‌ పార్టీ ఏదీ..? చ‌రిత్ర ఏందీ..? దృక్ప‌థం ఏంది..?  ప్ర‌జ‌ల గురించి ఏం ఆలోచిస్తుంది ఆ పార్టీ అని తెలుసుకోవాల‌ని కేసీఆర్ సూచించారు.

ప్ర‌జ‌ల చేతిలో ఉన్న వ‌జ్రాయుధం ఓటు

కాంగ్రెస్, టీడీపీ పాల‌న చ‌రిత్ర‌ మీకు తెలుసని పేర్కొన్నారు. అంద‌రి చ‌రిత్ర‌లు మీ చేతిలో ఉన్నాయని తెలిపారు.  వ్య‌వ‌హార‌శైలి, న‌డ‌క‌లు, వారు అవ‌లంభించిన ప‌ద్ద‌తులు మీ ముందున్నాయి. ఎన్నిక‌లు రాగానే ఆగ‌మాగం కావొద్దు. స్థిరంగా ఆలోచించాలి. ఏం చేస్తే లాభం జ‌రుగుత‌దో ఆ దారి ప‌ట్టాలి. అదే ప్ర‌జాస్వామ్యానికి దారి. ఓటును అల‌వోక‌గా వేయొద్దు. త‌మాషా కోసం వేయొద్దు. కార‌ణం ఏందంటే ఈ దేశంలో ప్ర‌జ‌ల చేతిలో ఉన్న వ‌జ్రాయుధం ఓటు. మీ త‌ల‌రాత మార్చేది.. భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే అని తెలిపారు. 

ఓటు స‌న్నాసికి వేస్తున్నామా..? స‌రైన వ్య‌క్తికి వేస్తున్నామా..?

హైద‌రాబాద్‌లో మేం ప‌ని చేస్తున్నామంటే అది మీరు ధార‌పోసిన శ‌క్తే. మీ శ‌క్తి లేక‌పోతే మేం చేసేది ఏం లేదు. ఓటు వేసే ముందు నిజ‌మైన పంథా ఎంచుకోవాలి అని సూచించారు. ఓటు స‌న్నాసికి వేస్తున్నామా..? స‌రైన వ్య‌క్తికి వేస్తున్నామా..? మ‌న అమూల్య‌మైన ఓటు స‌న్నాసికి వేస్తున్నామా..? స‌రైన వ్య‌క్తికి వేస్తున్నామా..? అని ఆలోచ‌న చేయ‌క‌ప‌సోతే మ‌న‌మే ఓడిపోతాం అని కేసీఆర్ అన్నారు.  మ‌న బ‌తుకుల‌ను ఎవ‌రు మార్చ‌లేరు. ఈ విష‌యాల‌ను మీరు ఆలోచ‌న చేయాలి. బీఆర్ఎస్ వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి మీకు తెలుసు. 

ప్రలోభాలకు ఓగ్గి ఓటెయ్యకూడదు 

ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టింది ప‌ది.. చేసింది వంద అని స్పష్టం చేసారు. ద‌ళిత‌బంధు పెట్ట‌మ‌ని ఎవ‌రూ చెప్ప‌లేదు. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామ‌ని ఎల‌క్ష‌న్ మేనిఫెస్టోలో చెప్ప‌లేదు. రైతుబంధు, రైతుబీమా కూడా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్ట‌లేదు.. కానీ చేసుకుంటూ పోయాం అని పేర్కొన్నారు. ఇల్లందు పోరాటాల పురిటి గడ్డ అని, ప్రలోభాలకు ఓగ్గి ఓటెయ్యకూడదని తెలిపారు. గత ప్రభుత్వాల పాలన, బీఆర్‌ఎస్ పాలనకు తేడా మీ కళ్లముందే ఉందని చెప్పారు. ప్రజలకు ఏ పార్టీ ఏం చేసిందో చూడాలని కోరారు.

రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్నబియ్యమే

ఇల్లందులో 48 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని తెలిపారు. ఈ జిల్లాలో కొందరు నేతలకు డబ్బులు రాగానే అహంకారం వచ్చిందని,  బీఆర్‌ఎస్ నేతలను అసెంబ్లీ గడప తొక్కనియమని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు ఇవ్వొద్దని, మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని విమర్శించారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని.. రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్నబియ్యమే ఇస్తామని హామీ ఇచ్చారు.