కాంగ్రెసోల్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లుని, జాగ్రత్తగా ఉండమని సీఎం కేసీఆర్ సూచించారు. నర్సాపూర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి ఓటు వెయ్యాలని సూచించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేసీఆర్ కు ఏంపనిలేదు..రైతు బంధు దుబారాగా ఇస్తున్నడంటడనని మండిపడ్డారు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహూల్ గాంధీ ధరణిని తీసి బంగాళాఖాతంలో వేయాలని అంటడు.ధరణి పోర్టల్’తో ప్రభుత్వం తనకున్న అధికారాన్ని ప్రజల బొటనవ్రేలుకు ఇచ్చింది. దరణి తీసేస్తే రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోలు డబ్బులు ఎలా వస్తయ్? ధరణి తీసేస్తే మళ్లీ వీఆర్వోలు, పహాణీ నకళ్లు, ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగాల్నా? అని ప్రశ్నించారు.
5 గంటల కరెంట్ మాత్రమే అంటున్న కాంగ్రెస్
ధరణి తీసేస్తే మళ్లా దళారుల రాజ్యం, భూకబ్జాలు, పైరవీకారులు, పాత రిజిస్ట్రేషన్ పద్ధతి, పడిగాపులు పడి ఉండాలె. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే తీసేస్తా అంటున్నదని హెచ్చరించారు. కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు మేం 5 గంటల కరెంట్ ఇస్తున్నామన్నడు. మరి మన తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నం అని తెలిపారు. కాంగ్రెసోల్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లుని అన్నారు. అసైన్డ్ భూములందరికి కూడా పట్టాలు చేసి వారికే ఇస్తామని చెబుతున్నా. కాంగ్రెస్ రాజ్యంలో మంజీరా, హల్దీ నదులు ఎలా ఉండె. వాటి మీద చెక్ డ్యాంలు కట్టకూడదని బ్యానర్లు పెట్టిండ్రని తెలియజేసారు. ఈరోజు చెక్ డ్యాంలు కట్టి నీళ్లందిస్తే మత్తెడులు పోస్తున్నయ్ అని వెల్లడించారు.
నర్సాపూర్ బంగారు తున్కగా..
24 గంటల కరెంటుతో రైతులు దర్జాగా కాలుమీద కాలేసుకొని ఉంటున్నరని హెచ్చరించారు. నాడు మంచినీళ్లకు ఎన్నో బాధలు ఉండేవి. నేడు అవన్నీ లేకుండా చేసినం అని స్పష్టం చేశారు. పిల్లుట్ల కాలువ కూడా పూర్తవుతుంది. నర్సాపూర్ బంగారు తున్కగా అవుతుంది. దాల్తాబాద్, కాసాల మున్సిపాలిటీలను, రంగంపేట మండలాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాదన్నారు. తప్పకుండా చేస్తాం అని హామీ ఇచ్చారు. కౌడుపల్లిలో డిగ్రీ కాలేజీ కి కూడా డిగ్రీ కాలేజీ వచ్చింది. మదన్ రెడ్డిని సముచితంగా గౌరవించుకుంటం. కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ లాంటివి ప్రజల బాధలను తగ్గించాలని చేసిన అని వివరించారు. మైనార్టీలకు గత ప్రభుత్వాల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశాం.. సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.