![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/11/Untitled-Project-1-16.jpg?resize=1024%2C576&ssl=1)
నేను చెప్పే చరిత్ర అబద్దమైతే నాకు ఓటేయొద్దని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పాలమూరు జిల్లా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి కాదు..చెక్ డ్యాంల రెడ్డి అని అన్నారు. పట్టుబట్టి 30 చెక్ డ్యాంలను మంజూరు చేయించి సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట పండించేటట్టు చేసారని వెల్లడించారు. ఇక్కడి ప్రజలను చూస్తేనే ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారనే నమ్మకం తనకు కలిగిందని అన్నారు.
గంజి కేంద్రాలు ఏర్పాటు చేసే గతి పట్టించినదే కాంగ్రెస్ పార్టీ
ఓటు రాబోయే ఐదేళ్లలో మీ భవిష్యత్ ను మార్చుతుందని సూచించారు. ఎవరి ద్వారా మంచి జరిగితే వాళ్లను గెలిపించండని చెప్పారు. గంజి కేంద్రాలు ఏర్పాటు చేసే గతి పట్టించినది ఏ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పాలమూరును సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ఉన్న రాష్ట్రాన్ని ఊడగొట్టి, తెలంగాణను పాలమూరు జిల్లాను సర్వ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏపీలో కలవకపోతే బాగా అభివృద్ధి చెంది ఉండేదని బచావత్ ట్రిబ్యునల్‌లో రాసి ఉందన్నారు. కానీ సమైక్య రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నేతలు ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇది చరిత్ర అని, ఒకవేళ నేను చెప్పేది అబద్దమైతే తమను ఓడించాలన్నారు.
ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం ఓటు
సమైక్య రాష్ట్రంలో పాలమూరును ఎవరూ పట్టించుకోలేదు. బీఆర్ఎఎస్‌కి అధికారం ఇస్తే ఎలా చేస్తారో మీకు తెలుసని అన్నారు. ఎవరు అధికారంలో ఉంటే మేలు జరుగుతుందో ఆలోచించి ఓటు వేయండని పేర్కొన్నారు. ప్రజల చేతిలో ఉండే ఓటు వజ్రాయుధం అన్నారు. అన్ని పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని కోరారు. 14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. దేవరకద్ర ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి అడిగిన వాటన్నింటిని గెలిచిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేవరకద్రలో లక్ష ఎకరాల్లో వరి పండేలా చేశాం అని స్పష్టం చేసారు. ఎన్నికల రాగానే ఆగమాగం కావొద్దు.. బీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే ఎలా పనిచేస్తారో మీకు తెలుసన్నారు. ఆ పార్టీలకు అధికారం అప్పజెప్తే ఎలా పరిపాలిస్తారు, పేదల గురించి,రైతుల గురించి ఏ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందో తెలుసుకొని ఓటు వేయాలన్నారు. ఆగం ఆగంగా ఓటు వేయొద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలని సూచించారు.