mt_logo

వంట చేసి పెడ్తే వచ్చి వడ్డిస్తా అన్నట్టు ఉంది కాంగ్రెస్ పరిస్థితి: చేర్యాలలో సీఎం కేసీఆర్

వంట చేసి పెడ్తే వచ్చి వడ్డిస్తా అన్నట్టు కాంగ్రెస్ పరిస్థితి ఉందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం మాట్లాడుతూ.. ఓటును మన స్వంత విచక్షణతో వినియోగించాలని సూచించారు. మన తలరాతను ఓటు మార్చుతది. చైతన్యమైన యువత వాస్తవాలను గుర్తించాలని అన్నారు. పదేండ్లు ముందు తెలంగాణ, పదేండ్ల తర్వాత తెలంగాణ ఎట్లా ఉందో మీరు ఆలోచన చేయాలన్నారు. చేర్యాల నుంచి జనగాంకు వెళ్ళేవాడిని ఇక్కడ  చెరువులో ఒక్క రోజు చెరువులో చారెడు నీళ్లు కూడా లేకుండే తెలంగాణకు ముందు. భయంకరమైన పరిస్థితి ఉండే అని గుర్తు చేసారు. 

 తెలంగాణ కోసం కొట్లాడినోడు ఎవడు?

ఒకరోజు  బచ్చన్నపేట మండలం  నుంచి వెళ్తుంటే అక్కడ ముసలివాళ్లను చూసి ఆగినా…యువకులు లేరని అడిగితే వలస పోయిండ్లను చెప్పిండ్లు.మంచి నీళ్లు కూడా లేవని చెబితే నేనే ఏడ్చినా ఆరోజు.దు:ఖం వచ్చింది. బచ్చన్నపేట చౌరస్తాలో ఏడ్చినాను.  ఇప్పుడు బచ్చన్నపేట చెరువు ఎప్పుడు నిండే ఉంటుందని సంతోషాన్ని వ్యక్తం చేసారు.  ఆనాడు ఎవ్వడూ లేడు. గొడగొడ ఏడ్చినం. తెలంగాణ కోసం కొట్లాడినోడు ఎవడు. ఉద్యమం చేసినోడు ఎవ్వడు. పేగులు తెగేటట్లు జై తెలంగాణ అని అన్నదెవరు.తెలంగాణ సాధించినోడు ఎవడు. సాధించిన తెలంగాణను నెంబర్ వన్ చేసినోడు ఎవడు.  24 గంటల కరెంటు తెచ్చినోడెవ్వడు. ప్రతి ఇంటికి మంచినీళ్లు తెచ్చినోడెవ్వడు. సాగు నీళ్లు తెచ్చినోడెవ్వడు. వంటలన్ని పెట్టి మీరు తయారుపెట్టుండి. వచ్చి నేను వడ్డిస్తా అని వెనకటికి ఒకడు అన్నడట. అట్లుంది కాంగ్రెస్ పరిస్థితి అని సీఎం ఎద్దేవా చేసారు. సాయి సంసారి లచ్చి దొంగ. వంటి లఫంగా మాటలు మాట్లాడుకుంటా..కాకరకాయ..తోకరకాయ మాట్లాడుతున్నారు. ఎవరు గోల్ తింపుతరు. ఇక్కడ అంత పిచ్చిపోసిగాళ్లమున్నామా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు