mt_logo

బంగాళాఖాతంలో ధరణిని వేస్తవా? లేక రైతులను వేస్తవా? రేవంత్‌ని ప్రశ్నించిన సీఎం కేసీఆర్

ధరణిని వేస్తవా? బంగాళాఖాతంలో రైతులను వేస్తవా? అని రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.  బూర్గంపాడు నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ..  30న ఓట్లు పడుతయి, 3న తేదీన లెక్కిస్తారు, అంతటితో పని అయిపోదన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాతే అసలుది ఉంటదని సూచించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం . ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం. పినపాక, భద్రాచలం ప్రాంతాల్లో గిరిజనులతో పాటు దళిత వర్గాలు కూడా ఉన్నారు. వారి బతుకులు కూడా బాగాలేవు

రోడ్లకు కరెంటు, నీళ్లకు ఎక్కువ ప్రాధాన్యత

దళితుల బతుకులు ఇలా ఉండటానికి బాధ్యులెవ్వరు? అని అడిగారు.  దళితుల కోసం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే స్పెషల్ గ్రోత్ ఇంజన్లు పెట్టి ఉంటే వాళ్ల బతుకులు ఇట్ల ఉండేది కాదు. వారిని వృద్ధిలోకి తెచ్చుకునేందుకే  దళితబంధు పథకం తెచ్చినాం అన్నారు. 10 సంవత్సరాల పరిస్థితి, బీఆర్ఎస్ పాలన మీ కండ్ల ముందు ఉందని తెలిపారు. రోడ్లకు కరెంటు, నీళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అని పేర్కోన్నారు.  వీటీపీఎస్ మణుగూరుకు రావాల్సి ఉండే, విజయవాడకు సమైక్య పాలకులు తీసుకువెళ్లారు. అందుకే భద్రాద్రి ప్లాంట్ నిర్మించుకున్నాం అని వెల్లడించారు. 

రైతుబంధు పుట్టించిందే బీఆర్ఎస్

అప్పులబాధలు పోవాలని, ఆత్మహత్యలు తగ్గాలని ప్రయత్నాలు చేశాం. విజయం సాధించాం. సాగునీటికి పన్నుతీసేశాం అని తెలిపారు. మొట్టమొదటిసారి భారతదేశంలో రైతుబంధు పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రపంచంలో ప్రభుత్వ మద్దతు లేకుండా రైతు బతికే పరిస్థితి లేదని వివరించారు. మన దేశంలో రైతులకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే వ్యవసాయ స్థిరీకరణ కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు చేపట్టింది. ఇదే జిల్లాకు చెందినటువంటి భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షడు మాట్లాడుతూ ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. దీనివల్ల రైతులకు నష్టం వస్తుందని హెచ్చరించారు. ధరణిని వేస్తవా బంగాళాఖాతంలో రైతులను వేస్తవా? అని అడిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం లేదని ఎద్దేవా చేసారు. 

 ప్రజలను గోల్ మాల్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్

 కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయం గురించి ఏం అవగాహన ఉన్నదో నాకు తెలియదు కానీ ధరణి తీసేస్తామంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యం వస్తుంది. ధరణి ఉండాలా? రైతుబంధు దుబారానా? రైతుబంధు ఉండాలంటే రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వేస్ట్ గాళ్లు ఎవ్వరూ? ఆలోచించడని సూచించారు. ఎవ్వరిని బంగాళాఖాతంలో వేయాలో మీరు నిర్ణయం చేయాలని అన్నారు.  కాంగ్రెస్ ప్రజలను గోల్ మాల్ చేసేందుకు పూనుకుంటున్నది. గోల్ మాల్ వాళ్లనే చేయాలని పేర్కొన్నారు.