శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ వీఆర్వో వ్యవస్థను కొనసాగించాలని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేవలం వీఆర్వో వ్యవస్థను మాత్రమే రద్దు చేస్తున్నాం. మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇప్పుడున్న వీఆర్వో వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉన్నందునే రద్దు చేశామని, ఇక రెవెన్యూ విభాగంలో అన్ని రికార్డులు ఉంటాయి. సర్వే సెటిల్మెంట్ వ్యవస్థ కూడా ఉంటుంది. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా అవసరాలకు మాత్రమే అసైన్డ్ భూములు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం లాగా అసైన్డ్ భూములను తీసుకోవట్లేదని, కేవలం ప్రాజెక్టులు, ప్రజా ప్రయోజనాల నిమిత్తమే ప్రభుత్వం భూములు తీసుకుంటున్నదని సీఎం వివరించారు.