mt_logo

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట’ జీవితం ఆదర్శవంతమైనది అని సీఎం తెలిపారు. తన రాజకీయ జీవితంలో సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు.సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ సామాజిక రంగాల్లో వారు ఆచరించిన  కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు  ప్రేరణ గా నిలిచిందన్నారు. సోలిపేట రామచంద్రారెడ్డి గారి మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.