mt_logo

తెలంగాణలో ప్రతి పల్లె ముఖ్రా (కే) కావాలి : సీఎం కేసీఆర్ పిలుపు 

తెలంగాణలోని ప్రతి పల్లె ముఖ్రా (కే) కావాలని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని, స్వయం సమృది బాటలో తెలంగాణ పల్లెలు పయనించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామంలో సేకరించిన చెత్త తో తయారు చేసిన వర్మికంపోస్టుతో వచ్చిన అదాయం నుంచి లక్ష రుపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వడం అద్భుతమని సీఎం అన్నారు. 

సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్రా (కే) గ్రామ సర్పంచ్, గ్రామస్తులు సీఎం కేసీఆర్ ను కలిసి సీఎం సహాయ నిధికి లక్ష రూపాయల చెక్కునందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… తెలంగాణ పల్లెలు ప్రగతి ప్రస్థానంలో సాగుతున్నాయని, గ్రామాల్లో పల్లె ప్రగతి ఫలాలు కనిపిస్తున్నాయని అన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయనడానికి ముఖరా కె గ్రామం ఉదాహారణగా నిలిచిందన్నారు. గ్రామంలో సేకరించిన తడిచెత్త ద్వారా వర్మికంపొస్ట్ తయారు చేసి 7 లక్షలు ఆదాయాని సంపాదించడం అద్భుతమన్నారు. అందులోంచి ముఖరా సర్పంచ్ లక్ష రుపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వడం అభినందనీయమన్నారు.

ముఖ్రా  సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామానికి వచ్చిన అదాయం నుంచి రూ.4 లక్షలతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామని, 2 లక్షల రూపాయలతో డిజిటల్ లైబ్రరి ఏర్పాటు చేసామని, 1 లక్ష రుపాయలు సీఎం సహాయనిధికి ఇస్తున్నామని సీఎం కు వివరించారు.

కాగా…ముఖరా కె గ్రామంలో లక్ష మొక్కలు నాటి 100% రక్షించడం ద్వారా ఈ గ్రామం దేశానికే అదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం పని చేస్తున్న సర్పంచ్ గాడ్గె మీనాక్షిని గ్రామ క్రమిటీని గ్రామస్తులను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా  గ్రామంలో తయారు చెసిన వర్మికంపొస్టు ప్యాకెట్ ను ముఖ్యమంత్రికి సర్పంచ్ మీనాక్షి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంపిటిసి గాడ్గె సుభాష్ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *