mt_logo

రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాల డైట్ చార్జీలను పెంచుతూ సంబంధిత ఫైలు పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు

-పెరిగిన డైట్ చార్జీలు జూలై నెల నుంచి అమలులోకి రానున్నాయి

రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నారు. గురుకుల హాస్టల్లలో చదువుకునే విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం వసతులను అందించేందుకు ప్రస్తుతం అందిస్తున్న డైట్ చార్జీలను పెంచుతూ సంబంధిత ఫైలు మీద శనివారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్ లో సీఎం కేసీఆర్ సంతకం చేశారు. పెరిగిన డైట్ చార్జీలు జూలై నెల నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ మేరకు  పెరిగిన డైట్ చార్జీల వివరాలు : 

3 వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న రూ. 950 ల డైట్ చార్జీలు రూ. 1200 కు పెరిగాయి.

8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్’ చార్జీలు రూ.1100 నుంచి రూ.1400 లకు పెరిగాయి.

11 వ తరగతి నుండి పీజీ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1500 నుంచి రూ.1875 లకు పెరిగాయి. 

కాగా… డైట్ చార్జీల పెరుగుదల కోసం సీఎం కేసీఆర్  మంత్రుల సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్ గారికి సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది.