కాంగ్రెసోళ్ళది నయా మోసం, నయా అబద్దాలతో వస్తున్నారని సీఎం కేసీఆర్ జాగ్రత్త చెప్పారు. మహబూబాబాద్ ప్రజాశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టువదలకుండా తెలంగాణ సాధించుకున్నామని గర్వించారు. తెలంగాణ వచ్చింది కాబట్టి మహబూబాబాద్ జిల్లా అయిందన్నారు. పట్టుబట్టి జిల్లా చేయించిన, అభివృది ఫలితాలు కన్పిస్తున్నాయన్నారు. ఆకేరు, మున్నేరు నదిపొడుతా నీళ్లు పుష్కలంగా వున్నాయి. అధ్బుతంగా పంటలు పండిస్తున్నారు.
ఎన్నికల్లో ప్రజలు గెలవాలి
మహబూబాబాద్‌లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నాయని సంతోషం వ్యక్తం చేసారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని సూచించారు. రెండు ఎలక్షన్లలో శంకర్‌నాయక్‌ను గెలిపించనందుకు అభివృద్దిని చూస్తున్నారని తెలిపారు. మీ ఊర్లకు పోయి నేను చెప్పినదాన్ని చర్చించండి.. నిజమేంటో తెలుసుకోండి. మాకు పరిశ్రమలు రావాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమ రావాలని కోరుతున్నారు. నాడు ఎరువుల కోసం చెప్పులు లెన్లులో పెట్టినం అని గుర్తు చేశారు. నేడు పుష్కలంగా ఎరువుల లభ్యమవుతున్నారు.
పదేళ్ల నుంచి ప్రజారాజ్యం
ధాన్యం అమ్మితే నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అయితా వున్నాయి.రైతు బందు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తున్నాయి. ధరణితో లాభాలే వున్నాయి కానీ, నష్టాలు లేవని స్పష్టం చేశారు. మీ భూమి మీద మీకే అధికారం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది.ధరణి తీసేస్తే ఇబ్బందులు ఎదర్కొంటాం కథ మొదటికే వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వస్తే ఎటువంటి పైరవీలకు ఆస్కారం వుండదని స్పష్టం చేశారు. పదేళ్ల నుంచి ప్రజారాజ్యం నడుస్తున్నదని తెలిపారు. 25 వేల ఎకరాలకు పొడు పట్టాలిచ్చినం. పోలీస్ కేసులు రద్దు చేసినం. రైతుబంధు, బీమా కూడా ఇచ్చినం, ధరణితో పల్లెలు ప్రశాంతంగా వున్నాయని చెప్పారు.
సంక్షేమ పథకాలు పకడ్బందీగా..
ఎలక్షన్ల పేరుతో అబద్దాలు చేప్పమని అన్నారు. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం, రైతుబంధు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 వేలు ఇస్తామన్నారు. పెన్షన్లు కూడా పెంచుకుందాం, మహిళలకు 3 వేల రూపాయలు ఇస్తాం అని హామీ ఇచ్చారు. విద్యాసంస్థలను కూడా పెంచుతాం, అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించండని విజ్ఞప్తి చేశారు. 60 ఎండ్లు మోసం చేసిన కాంగ్రెస్ నయా మోసం, నయా అబద్దాలు చెప్తుతూ మళ్ళీ ముందుకు వస్తుందని హెచ్చరించారు. ఇంత భారీ ఎత్తున తరలివచ్చిన ఈ సభ ద్వారా బీఆర్ఎస్ గెలువబోతుందని రుజువయిందని ఆశాభావం వ్యక్తం చేశారు.