mt_logo

మైనార్టీలకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. త్వరలో ఈ స్కీమ్ అమలవుతుందని తెలిపారు మంత్రి హరీశ్ రావు.జలవిహార్ లో మైనార్టీనేతల సమావేశంలో మంత్రులు హరీష్ రావు,మహమూద్ అలీ,ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్,దానం నాగేందర్,ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు… పాల్గొన్నారు.

పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రులు హరీష్ రావు,మహమూద్ అలీ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారు, రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారు. గంగ జమున తహజిబ్ అమలు చేస్తున్నారు మన సీఎం కేసీఆర్ అని తెలిపారు.

హిందువులకు కల్యాణ లక్ష్మి తెచ్చినట్టు మైనార్టీల కోసం షాది ముబారక్ తెచ్చారు.మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. త్వరలో ఈ స్కీమ్ అమలవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనార్టీలకు అందించనున్న  శుభవార్త.

కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ధ్వజమెత్తారు. దేశంలో ఇప్పటికి ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే అన్నారు. ఈ బడ్జెట్ లో 2200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన్నాము, ఒక్క సంవత్సరంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదని గుర్తు చేసారు.

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ కూడా అందుబాటులో ఉంది, రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నామన్నారు. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లు గా ఎదుగుతున్నారు. సల్వా ఫాతిమా ను పైలట్ అవుతానంటే అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ డబ్బులు ఇచ్చి ఫైలట్ చేశారు ఇప్పుడు ఆ అమ్మాయి నెలకు 5 లక్షలు సంపాదిస్తుందని తెలిపారు.

ముస్లింల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారని సూచించారు. దేశంలో మైనార్టీ అమ్మాయిలు ఎక్కువగా చదువుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే..  అమ్మాయిల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నము. నీట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉర్దూలో నిర్వహించాలని అడిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని తెలిపారు.

20 లక్షలు ఓవర్సిస్ స్కాలర్ షిప్ ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్నాము.రంజాన్ గిఫ్టులు, అజ్మీర్ దర్గా లో 5 కోట్లు కేటాయించి ఒక భవనం నిర్మిస్తున్నారని తెలిపారు.దేశంలో అన్ని మతాల ప్రజలను సమానంగా చూస్తున్న ఒకే ఒక్క సీఎం కేసీఆరే అని గుర్తు చేసారు. రంజాన్ పండుగ సందర్భంగా దావత్ ఏ ఇఫ్టర్ అన్ని జిల్లాలో ఇస్తున్నము..ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.