mt_logo

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్

జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో  చేరారు. తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి స్వగృహానికి చేరుకున్నారని వ్యాఖ్యానించారు. బాలకృష్ణారెడ్డి తొందరపడి నుంచి 2009 నుంచి బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారని.. ఆయన రాకతో తప్పిపోయిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు బాలకృష్ణారెడ్డి తోడుగా ఉన్నారని చెప్పారు. ఉద్యమ నేతలు అందరూ తిరిగి పార్టీలో చేరడం ఆనందంగా ఉందని చెప్పారు. ‘కొందరు నేతలు మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నారని అన్నారు. 

నోట్లకట్టలతో దొరికిన రేవంత్‌.. డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలంటూ సవాల్‌ విసురుతున్నారు. రేవంత్‌ తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుంది. కాంగ్రెస్‌ ఎన్నో బాధలు పెట్టి తెలంగాణ ఇచ్చింది. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణ ఇచ్చారు. రాష్ట్రం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కల్పించింది అప్పటి టీఆర్ఎస్ పార్టీనే. సంక్షేమం, అభివృద్ధి నినాదాలతో ముందుకెళ్తున్నాం. తెలంగాణ కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా?’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉంది.. తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటుంది ఇప్పటికే 11 సార్లు ఛాన్స్ ఇచ్చారు. కేసీఆర్‌ను దించేయాలంటున్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చినందుకు దించేయాలా..? దళితులకు దళిత బంధు ఇచ్చినందుకు దించేయాలా..? కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు కేసీఆర్‌ని దించేయాలా..? అని అడిగారు. 

తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలకు ఏం తక్కువ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలను బలి తీసుకుంది కాంగ్రెస్ కాదు.. ఆనాడు బలిదేవత అన్న రేవంత్‌కి.. ఇవాళ సోనియా దేవత అయిందా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఇటు రాహుల్ గాంధీ, అటు నరేంద్ర మోదీ ఇద్దరూ కూడా కేసీఆర్‌ని దించేయాలంటున్నారు. దేశంలో మీ పెత్తనానికి అడ్డు కట్ట వేస్తాడనే దించేయాలంటున్నారా..? ఏది ఏమైనా కేసీఆర్ దేశ రాజకీయాల్లో తన సత్తా చాటుతాడని స్పష్టం చేశారు.