mt_logo

డౌట్ లేదు 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం: మంత్రి హరీశ్ రావు

డౌట్ లేదు 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. గజ్వేల్ మీటింగ్‌లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మీ అందరి ఉత్సాహం చుస్తుంటే మీరు కొత్త చరిత్ర సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ కార్యక్రమంను ప్రధాని నరేంద్ర మోడీ చేత ప్రారంభం చేయించుకున్నము, అదే మిషన్ భగీరథ ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశానికి రోల్ మోడల్ గజ్వెల్ నియోజకవర్గం అని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పునరుద్ధరణ చేసిన అడవులు,మిషన్ భగీరథ కార్యక్రమం చూసేందుకు ఇవాళ దేశంలో అనేక మంది ఇక్కడ వస్తున్నారు. ఇవాళ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాము.

గజ్వెల్‌కు రైల్వే స్టేషన్ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని తెలిపారు. ఎన్నో రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లు ఇప్పుడు గజ్వెల్‌లో నిర్మాణం చేసుకున్నాము. దానితో ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లడం లేదని చెప్పారు.  ఇవాళ కూడవెళ్లి వాగు,హల్దీ వాగు నిండు కుండల్లా నీళ్లు ఎప్పుడు ఉంటున్నాయన్నారు.ఇవాళ 3500 కోట్ల రూపాయల వడ్లు పండిస్తున్నారు. నాడు నీళ్ల కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారు. గజ్వెల్‌కు ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పారు ఇవాళ ఇచ్చి చూపారని పేర్కొన్నారు. 

ఏ కార్యక్రమం అయిన గజ్వెల్‌లో చేసి ఇవాళ రాష్ట్రం అంత అమలు చేశారని అన్నారు. దయచేసి ఇంత బాగా చేసిన కేసీఆర్ ఋణం తీర్చుకోవాలి అంటే రాష్ట్రంలో అతి ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న అని విజ్ఞప్తి చేశారు.  ఇవాళ అనేక గ్రామాల్లో మూకుమ్మడిగా మా ఓటు కారు కు,కేసీఆర్ కు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. రానున్న 35 రోజులు బాగా కష్టపడి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం అన్నారు. 

గజ్వెల్‌లో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వెల్‌లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్, రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్,  బీఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేర్కొన్నారు.  24 ఏండ్ల క్రితం ఒక్కణ్ణే బయల్దేరి వెళ్ళాను, ఆనాడు కొంత మంది మిత్రులతో కూర్చుండి మన బ్రతుకు ఇంతేనా అని బాధ పడేవాళ్ళం, ఆనాడు నిస్పృహ, నిస్సహాయత ఉండేది కానీ ఏం చేయాలో తెల్వని పరిస్థితి ఉండేన్నారు. ఎక్కడ చూసిన చిమ్మని చీకటి, ఎవరిని కదిలించిన మన బ్రతుకులు ఎం ఉన్నాయి అనే ఆవేదన ఉండేదని గుర్తు చేశారు.

గజ్వెల్‌కు కావల్సింది చాలా ఉంది.లీడర్లు ఇదే చాలు అని ఊరుకోవద్దు, ఇంకా కావాలని పట్టుపట్టాలన్నారు.  ఊర్లలోకి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఊర్లో మోటర్ లేదు కానీ నీళ్లు వస్తున్నాయి.ఊర్లో మోటర్ లేదు…సంపూ లేదు నీళ్లు మాత్రం వస్తున్నాయి. దీనికి ప్రేరణ ఏంది అంటే సిద్దిపేట ఎమ్మెల్యే గా నేను ఉన్న అప్పుడు సిద్దిపేట లో భయంకరమైన కరువు ఉండే అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుండి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చాము.ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నాం. ఆనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసిన బిందెలతో ప్రదర్శనలు ఉండే ఇప్పుడు ఎక్కడ అలాంటి పరిస్థితి లేదన్నారు. 

నేడు మీరు ఇవాళ కొండపోచమ్మ సాగర్,మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయారు మీకు ఇవాళ యావత్ రైతాంగం ఋణపడి ఉంటుందన్నారు. ఇండియాలో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణ లో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయి ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తోనే సాధ్యం అయిందన్నారు. మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నాం.అయిన కాంగ్రెస్ వాళ్లు,కోదండరాం లాంటి వాళ్ళు అడ్డుకున్నారు. రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాలి. రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచుకుందామన్నారు. 

గజ్వెల్‌లో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు లు నిర్మాణం చేసుకున్నామన్నారు. మనం గెలుసుడు కాదు పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను గెలిపించాలని కోరుతున్న. అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి. గెలుస్తుందని అన్నారు. గెలుస్తున్నాం నాకు డౌట్ లేదు 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం.నేను కామారెడ్డి లో పోటీ చేయడానికి ఓ కారణం ఉంది. మీకు ఏం  కావాలో నేను చెపిస్తా అని హామీ ఇచ్చారు.  వచ్చే టర్మ్ లో నెలకు ఒక్కపూట గజ్వెల్ నియోజకవర్గంలోనే ఉంటా.. మీతోనే గడుపుతా.. అని పేర్కొన్నారు.