mt_logo

గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్

గ‌జ్వేల్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో తన నామినేషన్ దాఖలు చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో గ‌జ్వేల్‌కు బయల్దేరి వెళ్లి, నామినేష‌న్ దాఖ‌లు చేసారు. అనంతరం గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. గ‌జ్వేల్ నుంచి హెలికాప్ట‌ర్‌లో కామారెడ్డికి కేసీఆర్ బ‌య‌ల్దేరారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.