mt_logo

అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. 115 మందితో తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల కదనరంగంలో ముందంజలో నిలిచారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు.

ఈ సారి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా.. ఎప్పటిలాగే.. సిద్దిపేట నుంచి హరీశ్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ యథావిధిగా పోటీ చేయనున్నారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్లు పెండింగ్‌లో పెట్టారు.