mt_logo

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాంబుల సంస్కృతి తీసుకువస్తుంది: డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరం మీద చేసిన దాడిపైన తెలంగాణ డీజీపీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరంపైన దాడి చేయడం, టెంట్ పీకి వేయడం వంటి చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతకు క్షీణించాయి అని తమ ఫిర్యాదులో పేర్కొన్న బీఆర్ఎస్.. రాష్ట్రంలో రుణమాఫీ జరిగిన తీరు పైన ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయిన ఇద్దరూ మహిళా జర్నలిస్టులపైన, ఇతర జర్నలిస్టులపై దాడి చేసిన తీరుపైన కూడా ఫిర్యాదు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్న తీరును కూడా డీజీపీకి దృష్టికి బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్ళారు.రాజకీయ ప్రమేయం, జోక్యం వలన ప్రతిపక్ష నాయకులపైన పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, చేస్తున్న హింసపై కూడా ఈ సందర్భంగా ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్.. మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొన తీరును కూడా గుర్తుచేశారు.