గద్దెనెక్కిన క్షణం నుండి కేసీఆర్ ఆనవాలు చెరిపేస్తా అంటూ పేర్లు, లోగోలు మార్చే పనిపెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తప్పులో కాలేశాడు. స్పోర్ట్స్ అథారిటీ లోగోని మార్చాలన్న తాపత్రయంలో పాత లోగోలో ఉన్న కాకతీయ తోరణాన్ని తీసేసి, ఒక కాపీ లోగోని పెట్టి పరువు తీసుకున్నాడు.
కాకతీయ తోరణం, చార్మినార్ వంటివి కూడా కేసీఆర్ ఆనవాలుగానే రేవంత్ రెడ్డి పరిగణిస్తున్నాడని ఇటీవల రాష్ట్ర చిహ్నం మార్పు వివాదంలో మనకు అర్థమయ్యింది. నిన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పాత లోగోలో ఉన్న కాకతీయ తోరణం తీసేసి కొత్త లోగో ఒకటి రేవంత్ విడుదల చేశాడు. దాన్ని చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు.
ఎందుకంటే ఆ లోగో ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ నుండి కాపీ చేసి మక్కీకి మక్కీ దించారు. చక్కగా ఉన్న లోగోలను కేవలం వ్యకిగత దుగ్ధతో మార్చేసే ప్రయత్నం చేసి రేవంత్ అభాసుపాలయ్యాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కాపీ లోగో డిజైన్ చేయడానికి ఎన్ని డబ్బులు ఖర్చు చేశారో అని కూడా పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జరిగిన తప్పును దిద్దుకుని వెంటనే ఈ కాపీ లోగోను ఉపసంహరించుకుని.. ఇదివరకు ఉన్న కాకతీయ తోరణం లోగోనే పునరుద్ధరించాలి అని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు