
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం క్రింద ఆర్దిక సహాయం పొందేందుకు అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బీ.వెంకటేశం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం క్రింద విదేశాల్లో పీజీ విద్యను అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి (2023) సెప్టెంబర్ – అక్టోబర్ సెషన్ కు సంబంధించి అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తేదీ 01.09.2023 న ప్రారంభమై 30.09.2023 న ముగుస్తుందన్నారు. అభ్యర్థులు 30.09.2023 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు, ఆన్ లైన్ అప్లికేషన్లకు http://www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు.