mt_logo

కెనడాలోని టోరొంటో నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో 13 అక్టోబరు 2018 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటోలోని లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకున్నారు. సంఘం ఆధ్వర్యంలో మరియు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఐదవ బతుకమ్మ కావడంతో అందరు కూడ పండుగను అత్యంత సంబురంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేసారు. ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీ దేవెందర్ రెడ్డి గుజ్జుల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద, కార్యదర్శి శ్రీమతి రాధిక బెజ్జంకి, కోషాధికారి శ్రీ సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరక్టర్లు శ్రీ శ్రీనివాస్ మన్నెం, శ్రీమతి భారతి కైరొజు, శ్రీ మురళి కాందివనం, ట్రుస్టీ సభ్యులు శ్రీ శ్రీనివాసు తిరునగరి, శ్రీ సమ్మయ్య వాసం, అథీక్ పాష, ఫౌండర్లు శ్రీ రమేశ్ మునుకుంట్ల, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీనాధ్ రెడ్డి కుందూరి, శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ హరి రావుల్ పాల్గొన్నారు.

2018-20 కి ఎన్నికైన నూతన కమీటీలను ఈ పండుగ వేడుకలలో ప్రకటించి పరిచయం చేసారు. నూతన అధ్యక్షులుగా శ్రీ రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులుగా శ్రీ విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శిగా శ్రీ శ్రీనివాస్ మన్నెం, సాంస్కృతిక కార్యదర్శిగా శ్రీమతి దీప గజవాడ, కోషాధికారిగా శ్రీ దామోదర్ రెడ్డి మాది, డైరక్టర్లుగా శ్రీ మనోహర్ భొగా, శ్రీ శ్రీనివాస్ చంద్ర, శ్రీమతి మంగ వాసం, శ్రీ మూర్తి కలగోని, శ్రీ గణేశ్ తెరల, ట్రస్టీ బోర్డు అధ్యక్షునిగా శ్రీ హరి రావుల్, ట్రస్టీలుగా శ్రీ సురేశ్ కైరోజు, శ్రీ వేనుగోపాల్ రెడ్డి ఏళ్ళ, శ్రీ కిరన్ కుమార్ కామిశెట్టి మరియు శ్రీ నవీన్ ఆకుల.

ఈ సందర్భంగా ఈ సంవత్సరపు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా ఉపాధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద మరియు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం సాంస్కృతిక కార్యదర్శి వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *