హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని P V మార్గ్ లోనీ జలవిహార్ వద్ద international clinical trials day సందర్భంగా సుమారు 1000 మంది డాక్టర్లు, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్, ఫార్మాసిట్స్, clinical research staff సభ్యులు నిర్వహించిన 5K రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 5కే రన్ లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి మేమెంటోలు బహుకరించారు. అలాగే క్లినికల్ పరిశోధనలో విశేష సేవలను అందించిన వారిని గుర్తించి వారినీ సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ప్రజలకు క్లినికల్ ట్రైయల్స్ పైన అవగాహన పెంపొందించుకోవడం, పరిశోధన పట్ల ప్రజలు ఆసక్తిని కనబరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. పరిశోధనలో భాగంగా ప్రజలకు దుష్ఫలితాలు లేని విధంగా మెరుగైన వైద్యం అందుబాటులో తేవడానికి అవసరమయిన మందులు అందించేందుకు కృషి చేయాలని క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్, మంత్రి డాక్టర్లను కోరారు.