mt_logo

30 రోజుల్లోనే 30 రకాలుగా తెలంగాణ ప్రజలను వంచించిన కాంగ్రెస్ సర్కార్ 

ప్రజా పాలన పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..  ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుండే తెలంగాణ ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టింది. డిసెంబర్ 9 నుండే రైతు బంధు ఎకరానికి రూ. 15,000 ఇస్తామని, తొలిరోజే రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు పెంచుతామని మాట ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ప్రజలు ఓటు వేయగానే మరిచిపోయారు. నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు చేసి, ఇప్పుడేమో అసలు ఆ మాటనే అనలేదు అని బుకాయిస్తున్నారు. 

పదేళ్ల తరువాత పదవిలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు అప్పుడే మితిమీరిన అహంకారంతో రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి తెగబడుతున్నారు. అస్తవ్యస్త తిరోగమన నిర్ణయాలతో తెలంగాణకు, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర నష్టం కలుగజేస్తున్నది  కాంగ్రెస్ ప్రభుత్వం. 

30 రోజుల్లోనే 30 రకాలుగా తెలంగాణ ప్రజలను వంచించిన కాంగ్రెస్ సర్కార్ వివరాలు 

బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల నిలిపివేత 

  1. ఎన్నికలప్పుడు రైతు బంధు రైతుల ఖాతాలో జమ చేయనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా.. ఇంకా రైతు బంధు వేయకుండా కాలయాపన చేస్తుంది. 
  2. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి గృహలక్ష్మి దరఖాస్తులు నిలిపివేత.  
  3. లబ్దిదారులకు కేసీఆర్ కిట్ నిలిపివేత. 
  4. దళిత బంధు పథకం ద్వారా గ్రౌండ్ అయిన యూనిట్లకు మిగిలిన నిధులు నిలిపివేత, గ్రౌండ్ కాని  యూనిట్ల రద్దు. 

బ్రాండ్ హైదరాబాద్ కు దెబ్బ మీద దెబ్బ!

  1. అయిదు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే ఫార్మా సిటీ ప్రాజెక్టు రద్దు 
  2. శంషాబాద్, రాజేంద్ర నగర్, బుద్వేల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లోని లక్షలాది మందికి ఉపయోగపడే  ఎయిర్ పోర్ట్ మెట్రో  ప్రాజెక్టు నిలిపివేత. 
  3. కొత్త ప్రభుత్వం సహకరించకపోవడంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ఫార్ములా-ఈ’ రేస్ హైదరాబాద్ లో నిర్వహించలేమని ప్రకటించిన సంస్థ. 
  4. తెలంగాణలో పెట్టుబడులు పెడతాం అని 6 నెలల ముందే ప్రకటించిన కార్నింగ్ సంస్థ కొత్త ప్రభుత్వం మీద నమ్మకం లేక తమిళనాడుకు తరలిపోయింది.  

ప్రచారం ఫుల్. డెలివరీ నిల్!

  1. ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎంకే విన్నవించుకోవచ్చు అని ఆర్భాటంగా మొదలుపెట్టిన “ప్రజాదర్బార్” లో రేవంత్ రెడ్డి కేవలం ఒక్క రోజు మాత్రమే పాల్గొన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తీసుకునే ప్రజావాణి మాదిరిగానే అధికారులే వినతులు తీసుకుంటున్నారు. 
  2. సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని ప్రకటించి ఒక్క రోజు కూడా పాటించకుండానే రోజుకు నాలుగు సార్లు ట్రాఫిక్ ఆపుతూ మాటలకు చేతలకు పొంతన ఉండదని నిరూపించుకుంటున్నారు. 

అస్తవ్యస్త తిరోగమన పాలన!

  1. యాసంగి పంటలకు జూరాల, కల్వకుర్తి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు అందించలేము అని క్రాప్ హాలిడే ప్రకటించగా, ఎస్సారెస్పీ ఆయకట్టుకు కూడా సాగునీటి కోతలు విధిస్తున్నారు. 
  2. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నివాసాలకు, వ్యవసాయ మోటార్లకు, పరిశ్రమలు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 
  3. విధి విధానాలు ఖరారు చేయకుండా, అర్హతలు ఏమిటో చెప్పకుండా, ఎప్పటి నుంచి పూర్తిగా అమలు చేస్తారో చెప్పకుండా కోట్లాది మంది ప్రజల నుండి “ప్రజా పాలన” దరఖాస్తుల పేరుతో కాలయాపన. క్యూ లైన్లలో అష్టకష్టాలు పడ్డ సామాన్య ప్రజలు. 
  4. తమ పార్టీ వారికే ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి, తాము చెప్పిన వారి దరఖాస్తులు మాత్రమే తీసుకోవాలి అని అధికారుల మీద రుబాబు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు. 
  5. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మొదలు పెట్టి తగినన్ని సర్వీసులు ఆర్టీసీ నడపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు. బస్సులు ఖాళీ లేక నిలబడి కూడా ప్రయాణించలేకపోతున్నాం మా గోడు వినే వాడు లేడు అని ఆవేదన చెందుతున్న పురుషులు. 
  6. ఉచిత బస్సు పథకంతో మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని, ఉపాధి కోల్పోతున్నామని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న ఆటో డ్రైవర్లు. 
  7. కాంగ్రెస్ అనాలోచిత ‘ఫ్రీ బస్సు’ పథకంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ సతీష్ గౌడ్. 
  8. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న 60 మంది రైతులపై అట్టెంప్ట్ టు మర్డర్ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి హింసిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 
  9. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని మేనిఫెస్టోలో నమ్మబలికిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి నెల తిరగకుండానే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, జాతీయ హోదా రాదని చేతులెత్తేశారు. 
  10. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల నిలిపివేత, పనులు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియక సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన కార్మికులు. 
  11. జిల్లాల పునర్విభజనను సమీక్ష చేసి కొన్ని జిల్లాలు రద్దు చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన. కొన్ని జిల్లాలు ఇప్పుడు రద్దు చేస్తే ఆయా జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు రేగే అవకాశం. కొత్త జిల్లాలను గుర్తించి, నోటిఫై చేసి, కొత్త జిల్లాల గెజిట్ విడుదల అయ్యే వరకు ఉద్యోగ నియామకాలు ఆగిపోయే ప్రమాదంతో తీవ్ర ఆందోళనలో నిరుద్యోగులు. 
  12. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అని చైర్మన్ మరియు సభ్యులను రాజీనామా చేయించగా.. రాజీనామాలను గవర్నర్ ఆమోదించకపోవడంతో సందిగ్ధంలో పడ్డ టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ. ఇంకా ఆలస్యం కానున్న రిక్రూట్మెంట్ ప్రక్రియ.  

అధికార దుర్వినియోగం 

  1. ఏ పదవి లేకపోయినా సీఎం గారి అన్నదమ్ములు సెక్రెటేరియట్‌లో ప్రభుత్వ మీటింగుల్లో పాల్గొంటున్నారు.  
  2. కాంగ్రెస్ పార్టీ రివ్యూ మీటింగ్ ను సెక్రెటేరియట్‌లో పెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. 
  3. ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేలను పక్కన పెట్టి..  ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులను అధికార మీటింగుల్లో చోటు. 

అధికారం తలకెక్కి రాక్షస పాలన 

  1. ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేసిన రోజే సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కొట్టి చంపేస్తా అని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు.  
  2. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు విపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద, కార్యకర్తల మీద భౌతిక దాడులకు దిగుతున్నారు, కక్షా రాజకీయాలకు, హత్యా రాజకీయాలకు తెరలేపుతున్నారు.  
  3. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో గిరిజన రైతు మృతి చెందినట్లు కధనాలు. 

రిమోట్ ఢిల్లీలో

  1. పదవుల పంపకాల కోసం నెల రోజుల్లో 6 సార్లు ఢిల్లీకి పయనమైన సీఎం రేవంత్ రెడ్డి, ఏ నిర్ణయాలు తీసుకునే అధికారం తన దగ్గర లేకపోవడంతో ఢిల్లీ అధిష్టానం వద్ద పడిగాపులు. 
  2. తనకు మంత్రి పదవి కావాలి అని బహిరంగంగా డిమాండ్ చేస్తున్న పలువురు నేతలు – రేసులో  కోమటిరెడ్డి రాజగోపాల్, ఉత్తమ్ పద్మావతి. మంత్రి పదవి కోసం జూబిలీ హిల్స్ లో ఎకరం స్థలం రాసిస్తానని బేరం ఎమ్మెల్యే  గడ్డం వివేక్ బేరం మాట్లాడుకున్నట్లు వార్తలు.