mt_logo

దేశ సరిహద్దులో సైనికుల మాదిరే పోలీసుల కృషి :మంత్రి కేటీఆర్​

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో తొట్టతొలి నాలుగు రోజుల  పోలీసు వార్షిక క్రీడా సంబురాలు మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. పోలీసుల వార్షిక క్రీడా సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి కే. తారక రామారావు మాట్లాడుతూ….

పోలీస్ జాబ్ అంటేనే ఒత్తిడి తో కూడిన ఉద్యోగం అని … వీరికి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల శారీరక, మానసిక దృఢత్వమే కాకుండా ఒత్తిడి నీ అధికమించవచ్చునని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడంతో.. వారిలో నూతన ఉత్సాహం వస్తోందన్నారు. 9 ఎండ్లలో తెలంగాణ ను ప్రశాంత, భద్రతతో కూడిన తెలంగాణ గా పోలీస్ లు తీర్చిదిద్దారనీ అన్నారు. పోలీస్ ల కృషి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.  ఇలాంటి క్రీడలు సంవత్సరం కు ఒక్కసారే కాకుండా  ప్రతి సంవత్సరం రెండు, మూడు సార్లు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.. జిల్లాలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు నా సహాయం ఎప్పుడూ ఉంటుందన్నారు.

అభయ అప్లికేషన్ ను రూపొందించడం ప్రశంసనీయం

దేశ సరిహద్దులో సైనికుల మాదిరే దేశం లోపల అసాంఘిక  శక్తుల తో పోలీస్ లు అలుపెరగని పోరాటం చేస్తున్నారనీ కొనియాడారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా రాజన్న సిరిసిల్ల ప్రజల సంక్షేమం కోసం  అభయ అప్లికేషన్ ను రూపొందించడం ప్రశంసనీయం. నేరాల నియంత్రణ కు సేఫ్ అటో అప్లికేషన్ ఉపయోగడుతుందనీ తెలిపారు. దీని రూపకల్పనకు ప్రత్యేక చొరవ తీసుకున్న ఎస్పి కి ఈ సందర్భంగా మంత్రి  అభినందించారు. జిల్లాలోని అన్ని అటో ల కు ఈ యాప్ అనుసంధానం చేయాలన్నారు . ప్రతి అటో పై డ్రైవర్ పేరు, కాంటాక్ట్ నంబర్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన  పోలీస్ అధికారుల పేర్లు, కాంటాక్ట్ నంబర్ ను డిస్ప్లే చేయాలన్నారు. అనంతరం క్రీడా పోటీలలో విజేతలకు ట్రోఫీ లు అందజేశారు.