mt_logo

 జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ తో సీ.ఎస్, డీజీపీ భేటీ

 హైదరాబాద్: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను నేడు, మంగళవారం, ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఒకరోజు పర్యటనకు హైదరాబాద్ కు వచ్చిన హన్సరాజ్ గంగారామ్ ను హరితా ప్లాజా లో కలసి తెలంగాణా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలను సి.ఎస్ శాంతా కుమారి వివరించారు.   తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్లు, రిజర్వేషన్ రోస్టర్ అమలుపై బీసీ కమీషన్ చైర్మన్ కు సి.ఎస్, వివరించారు. వీరితోపాటు జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్  సలహాదారు రాజేష్ కుమార్ కూడా వచ్చారు.అనంతరం మెదక్‌లోని జీఎం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ సీఎండీ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌), హైదరాబాద్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఉస్మానియా, డీడీ న్యూస్‌ రీజినల్‌ హెడ్‌తో జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ భేటీ అవుతున్నారు.