పెద్దపల్లి: సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మొట్ట మొదట మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించనున్న మంత్రి.. ఆ తర్వాత 2.45 గంటలకు హెలికాప్టర్‌లో గోదావరిఖనికి చేరుకొని, 3 గంటలకు రామగుండం కమిషనరేట్‌ను ప్రారంభించనున్నారు. గోదావరిఖని-రామగుండం మధ్య పోలీసు హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో 29 ఎకరాల స్థలంలో 59 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కమిషనరేట్‌ను సువిశాలంగా నిర్మించారు. ఈ ప్రారంభోత్సవం తర్వాత పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం 4 గంటలకు రామగుండం మున్సిపల్‌క్రమాలను తెలియజేసేలా నిర్మించిన పైలాన్‌ను మంత్రి ఆవిష్కరిస్తారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.