సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఇట్నేని లచ్చవ్వ(80) దండం పెట్టి దీవించింది. లచ్చవ్వ కొద్దికాలంగా కంటిచూపు సమస్యతో బాధపడుతుండటంతో గ్రామంలో కంటివెలుగు శిబిరం ప్రారంభించిన విషయాన్ని సర్పంచ్ రాజమౌళి ద్వారా తెలుసుకొని ఉచితంగా పరీక్షలు చేయించుకుంది . లచ్చవ్వకు పాయింట్ ఎక్కువగా ఉండడంతో వైద్యసిబ్బంది కండ్లద్దాలకు ఆర్డర్ పెట్టారు. కంటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. పరీక్షలు చేయించుకొని బయటకొస్తూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని చూసి తనలాంటి ఎందరికో కంటి చూపు ప్రసాదిస్తున్నాడని లచ్చవ్వ మనసారా దీవించింది. ఈ దృశ్యం సోమవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కటాపూర్‌లో కనిపించింది.