mt_logo

రేపు హన్మకొండ  జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన 

హన్మకొండ జిల్లాలో రేపు మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. బాలాజీ గార్డెన్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం చేసి అక్కడి నుంచి వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వరంగల్‌ రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌లో రూ.1.80 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా రేపు  మధ్యా హ్నం 3.30 గంటలకు హుస్నాబాద్‌ నుంచి ఎర్రగట్టు గుట్ట వద్ద ఉన్న కిట్స్‌ కళాశాలకు చేరుకోగానే ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. హన్మకొండ బాలసముద్రం లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. హన్మకొండలో కార్మిక భవన్‌, పూలే భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, ఆ తర్వాత  అత్యాధునికంగా నిర్మించిన వైకుంఠదామాన్ని ప్రారంభించనున్నారు.