జమ్ముకశ్మీర్ కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ముగ్గురి జవాన్లలో అనిల్ మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. అనిల్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్‌ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. అనిల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బాల లక్ష్మి-మల్లయ్యకు అనిల్ చిన్న కొడుకు. అనిల్ 2011లో సైన్యంలో చేరాడు.