mt_logo

భావోద్వేగంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన కాంట్రాక్టు లెక్చరర్లు

సీఎం గారు మీ రుణం తీర్చుకోలేము : కాంట్రాక్టు లెక్చరర్లు

తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేసినందుకు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు, ఆనందం వ్యక్తం చేస్తూ తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మంగళవారం నాడు సచివాలయంలో వివిధ కాంట్రాక్టు అధ్యాపక సంఘాల నాయకులు కలిసారు. తమ ఉద్యోగాలను పర్మినెంటు చేసి తమ కుటుంబాలను ఆదుకున్నందుకు మీ రుణం తీర్చుకోలేమని సీఎం గారికి భావోద్వేగంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో రెగ్యులరైజ్ అయిన వివిధ కాంట్రాక్ట్ అధ్యాపక సంఘాల నాయకులు ….. ఆర్జెడి కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ రెడ్డి, కార్యదర్శి సురేష్, మైనారిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రహీం, మాలతి, కొండల్, శ్రీనివాస్ తదితరులున్నారు.