mt_logo

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్, అధికారుల నివాస భవనములకు శంకుస్థాపన : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

జిల్లా కలెక్టర్, జిల్లా అధికారుల నివాస భవనములకు శంకుస్థాపన చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.  నిర్మల్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఎదురుగా  8 కోట్ల నిధులతో కలెక్టర్,లోకల్ బాడీస్ ,రెవెన్యూ తదితర శాఖల రెసిడెన్స్ భవన సముదాయాల నిర్మాణాలకు గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  జడ్పి ఛైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్, జిల్లా పాలనాధికారి  వరుణ్ రెడ్డి SP ప్రవీణ్ కుమార్ లతో  కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ సమీపంలో ఈ భవనాలను నిర్మించడం వల్ల అధికారులకు పాలన పరంగా సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. రెండు కోట్ల వ్యయంతో పోలీసు రెసిడెన్సి లను కూడా నిర్మిస్తున్నట్లు మొత్తం 10 కోట్లతో ఈ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.  దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత 10 కోట్ల వ్యయంతో కూడిన ఆ భవన సముదాయాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని ఆరు, ఏడు నెలల్లో భవనాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి ఆదేశించినట్లు తెలిపారు.