- కేసిఆర్ తోనే దేవాలయాలకు పూర్వ వైభవం
- దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు
- పోచంపల్లిలో శ్రీరామచంద్రస్వామి గుడి శంకుస్థాపన
- బిసి తండాలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
- అవుతాపురంలో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
- పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన
సీఎం కేసిఆర్ తోనే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చింది. రాష్ట్రంలోని ధూప దీప నైవేద్యాలకు కూడా నోచని దేవాలయాలను బాగు చేసిన ఘనత సీఎం కేసిఆర్ దే. ఆయన స్ఫూర్తితోనే నేను కూడా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవాలయాలను పునరుద్ధరిస్తున్నాను. ఆయన ఆశీస్సులతో నియోజకవర్గంలోని పురాతన దేవాలయాలన్నీ బాగయ్యాయి అని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్నది. తడిసిన ధాన్యాన్ని కూడా మామూలు ధాన్యం ధరకే కొనుగోలు చేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు. ఎకరాకు రూ.10వేల పంటలకు పరిహారం ప్రకటించిన మనసున్న మహారాజు సీఎం కేసిఆర్ గారు చెప్పారని అన్నారు.