mt_logo

వినూత్న రీతిలో కృతజ్ఞతలు

పెద్దపల్లి: రైతు బీమా తరహాలో గీత కార్మికులకు బీమా ప్రకటించిన ముఖ్య మంత్రి కేసీఆర్ కు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు గీతాకార్మికులు. ప్రమాదవశాత్తు గీతాకార్మికులు మరణిస్తే బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల గీతకార్మికుల కుటుంబాలకు లభించనున్న భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే .. ఈ కారణంగానే పెద్దపల్లి జిల్లా మండలం కుక్కలగూడూర్ లో జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి ఆధ్వ ర్యంలో గీతకార్మికులు ఆదివారం తాటిచెట్టు ఎక్కి ముఖ్యమంత్రికి ఇలా ధన్యవాదాలు తెలియజేసారు.