mt_logo

తెలంగాణ జైళ్ల శాఖ దేశంలో నే మూడో స్థానం

జైళ్లు మరియు సంస్కరణల శాఖ పై సమీక్షించిన హోం మంత్రి

రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ జైళ్లు మరియు సంస్కరణల శాఖ పై మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం లోని హోం మంత్రి కార్యాలయం లో జరిగిన ఈ సమీక్షలో శాఖ ఇంచార్జి డిజి మరియు హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్,  ఐ జి రాజేష్, జైళ్ల శాఖ డీఐజీలు, సూపరిండెంట్లు తదితరులు పాల్గొన్నారు. జైళ్ల శాఖ పనితీరు పైన, ఆ శాఖలో నెలకొల్పిన పారిశ్రామిక యూనిట్ల పైన, శాఖ ఆధ్వర్యంలో ఉన్న పెట్రోల్ బంకుల పైన, ఖైదీలకు నిర్వహిస్తున్న కార్యక్రమాల పైన, జైళ్ల శాఖకు సంబంధించిన మెజిస్టీరియల్ విచారణల తీరుపై సమీక్ష సమావేశంలో హోం మంత్రి చర్చించారు. టి ఐ ఎస్ ఎస్,ముంబై వారు ఇతర సంస్థలతో కలిసి నిర్వహించిన సర్వేలో తెలంగాణ జైళ్ల శాఖ దేశంలో మూడో స్థానం సంపాదించడం పట్ల హోం మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. శిక్షకాలం పూర్తి చేసుకున్న తర్వాత ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే  పెట్రోల్ బంకులలో ఉద్యోగం కల్పించడం మంచి విధానమని అన్నారు.