- కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజలు కొనుగోలు చేస్తాం
- అన్నదాతలు అధైర్య పడవద్దు అండగా ఉంటాం
- వంద సంవత్సరాల చరిత్రలో మొదటిసారి భారీ పంటనష్టం
- వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం
- కోనుగోలు కేంద్రాలకు తరలించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
- 17శాతం నుండి 20శాతం తేమ సడలించాలని ఎఫ్ సి ఐ ని విజ్ఞప్తి చేసాం
- 20 శాతం తేమ ఉన్న ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లతో మాట్లాడుతున్నాం
- రాష్ట్రంలో దాదాపు 5వేల కోనుగోలు కేంద్రాల ద్వారా 1350 కోట్ల విలువగల 7.51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.రాష్ట్ర బీసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
మంగళవారం కరీంనగర్ జిల్లా బొమ్మకల్, దుర్శేడ్ గ్రామలలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను, గోపాలపూర్ లో నష్టపోయిన ఉద్యాన పంటలను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన వంద సంవత్సరాల చరిత్రలో మొదటి సారి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలో ఊహించని విధంగా అకాల వర్షాలు కురిసి పండించిన పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని అన్నారు. వర్షాల కారణంగా చేతికందిన పంట పూర్తిగా నెలపాయిన స్థితి ప్రస్థుతం నెలకొందని పేర్కోన్నారు. ఇప్పటికే అకాలవర్షాలతో పంటను నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి 10000/- రూపాయలను పంటనష్ట పరిహరంగా ప్రకటించారన్నారు. పౌరసరఫరాలశాఖ తరపున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి దాన్యం గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రానికి రాకముందే పంటను నష్టపోయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందనే బరోసాను రైతులకు కల్పించారు. ధాన్యం ఆరబెట్టి తేమ వచ్చిన వెంటనే తిరిగి వర్షాలు పడి తేమశాతం పడిపోతుండంతో ధాన్యం తేమను 17శాతం నుండి 20శాతానికి సడలించాలని
1350 కోట్ల విలువగల 7లక్షల 51 వెల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయడం జరిగింది
ఎఫ్ సి ఐ ని కోరడం జరిగిందన్నారు. దాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా అలస్యం కాకుండా రైతులు, మిల్లర్లతో మాట్లాడుతున్నామని, బాయిలర్ సౌకర్యం ఉన్నచోట దాన్యాన్ని తరలించుకోవాలని సూచించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 1 లక్షా 28 మెట్రిక్ టన్నుల దాన్యం ఇవ్వడం జరిగిందని, మరికొంత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 5వేల దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సోమవారం సాయంత్రం వరకు దాదాపు 1350 కోట్ల విలువగల 7లక్షల 51 వెల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, గతంలో మే మాసం నాటికి 3లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయగా, ఈ సారి 7 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఎంతవీలైతే అంత రైతులను ఆదుకునే దిశగానే కృషిచేయడం జరుగుతుందని తెలిపారు. సహాయ సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, కరీంనగర్ చే జారిచేయనైనది.