
హైదరాబాద్ నానక్‌రాంగూడలో సెల్లాంటిస్ డిజిటల్ హబ్ ఆఫీస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆటోమొబైల్ రంగం కూడా ఇప్పుడు కంప్యూటర్ ఓరియెంటెడ్ డిజైన్స్ ద్వారా ముందుకు వెళ్తున్నదని చెప్పారు. ప్రభుత్వం మొబిలిటి వ్యాలిని ప్రారంభించిందని . కంపెనీకి ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. హైదరాబాద్‌లో అభివృద్ధి విప్లవంలా సాగుతోంది. వ్యాపార విస్తరణకు నగరం ఎంతో అనుకూలమైనది. ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లను ప్రోత్సహిస్తున్నాం. సమర్థ ప్రభుత్వం, పటిష్ఠ నాయకత్వం వల్లే పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు.
