- మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో ములుగు జిల్లా కొండాయికి హెలికాప్టర్ తో సహాయ చర్యలు
- జిల్లా జిల్లా కలెక్టర్ ,ఎస్పీ ఉన్నతాధికారులతో వరద ప్రవహిత ప్రాంతాలపై మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ కొండాయి లో భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగునీరు, హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.