కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఛలో నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగలోని ముఖ్యాంశాలు:
మన నీటి వాటా కోసం ఛలో నల్గొండ సభ
పెట్టినం
నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు
మన నీళ్లు దొచుకునేందుకు వస్తున్న వారికి ఈ సభ ఒక హెచ్చరిక
టీఆర్ఎస్ వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ జిల్లాగా నల్గొండను చేశినం
ఫ్లోరైడ్ నిర్మూలన కోసం నాడు ఎవ్వడూ రాలేదు.. ఓట్లున్నప్పుడే వస్తారు
ఫ్లోరైడ్ బిడ్డలను తీసుకొని నాటి ప్రధాని ముందు పెట్టినం
ఇది చిల్లరమల్లర సభ కాదు
అందరికీ హెచ్చరిక ఈ నల్గొండ సభ
5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య
మీ అందరి దీవెనలతో పదేండ్లు పాలించుకున్నం
ఎక్కడో ఉన్న కరెంటును ఒక్క క్షణం పోకుండా చేసిన.
నా ప్రాంతం, నా గడ్డ అనే ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం
ఆనాడు జల సాధన ఉద్యమంలో ‘పక్కన కృష్ణమ్మ ఉంటే ఫలితమేమీ లేకపాయె’ అనే పాట రాసిన.
పాలమూరు ప్రాజెక్టులో 80% పూర్తయింది
ఛలో నల్గొండ రాజకీయ సభ కాదు..ఉద్యమ పోరాట సభ
24 ఏండ్లుగా తెలంగాణ ప్రజల కోసం పక్షిలా తిరుగుతున్నా
ఫ్లోరైడ్ హమస్యపై వారం రోజులు పార్లమెంటు జరగనీయకుండా కొట్లాడినం. వందలాది ఉత్తరాలు రాసినం, కొట్లాడినం
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు పోయి మా వాటా మాకు కావాలని కొట్లాడాలె
కాంగ్రెస్ పాలన మూడో నెలలోనే ఏం జరుగుతున్నదో మీకు తెలుసు
ఉమ్మడి రాష్ట్రంలో బాగుండె.. ఇప్పుడు బాగా లేదంటూ సోయి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నరు..
బడ్జెట్ గురించి మాట్లాడకుండా.. అర్జంటుగా శాసనసభ తీర్మానం పెట్టి మమ అనిపించుకున్నరు.
వాళ్లకు పైరవీలు, పైసలు కావాలే గానీ ప్రజల గురించి పట్టదు
మన హక్కుల కోసం అవసరమైతే సద్దులు కట్టుకొని రావాలె..కొట్లాడాలె
కొత్త గవర్నమెంటు వస్తే గత గవర్నమెంటు కంటే మంచి పనులు చేయాలె..కానీ దుర్మార్గమైన భాష మాట్లాడుతూ పాలిస్తున్నారు
బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండి కొట్లాడాలి
టీఆర్ఎస్ గవర్నమెంటు వచ్చిన తర్వాత కరెంటు తెచ్చినం. మన గవర్నమెంట్ వచ్చిన ఎడాదిన్నర నుంచి 24 గంటల కరెంటు ఇచ్చినం
కేసీఆర్ పోంగనే కరెంట్ పొతదా?. నిలదీయండి
దద్దమ్మలు పాలిస్తే గట్లనే ఉంటది
5600 మెగావాట్ల కరెంటు ఉన్నా ఎందుకు ఇస్తలేరు?
కరెంటు, మంచినీళ్లు రాకున్నా ఎక్కడికక్కడ నిలదీస్తం.. కొట్లాడుతం
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ లోనే కరెంట్ తీసిండ్రు
ప్రజల హక్కులకు భంగం కలిగితే బతకనీయం.. వేటాడుతం..వెంటాడుతం
మా ప్రభుత్వంలో 3 కోట్ల టన్నులు పండించినం. మీరు రైతు బంధు కూడా ఇయ్యలేరా?
రైతులను పట్టుకొని చెప్పుతీసుకొని కొడతామంటారా? ఎంత కండ కావరం మీకు..
రైతులకు కూడా చెప్పులుంటయ్.. వాళ్లు కొడితే మూడు పండ్లు రాలుతయ్..
కేసీఆర్ ను తిరగనీయరా? సంపుతరా?.. రండి..సంపుదురండి..
తెలంగాణ తెచ్చిన కేసీ ఆర్ ను సంపి బతికి బట్టకడతరా?
కాంగ్రెస్ నేతలు కేసులు వేసినా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లినం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయితే మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తయ్
మేడిగడ్డ దగ్గర ఏం ఉన్నది? ఎందుకు పోతున్నరు? దమ్ముంటే నీళ్లు ఎత్తిపొయండి
మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల్లో రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు
సాగర్, కడెం, మూసీ ప్రాజెక్టుల పిల్లర్లు గతంలో కుంగిపోలేదా? రిపేర్ చేయలేదా? కుంగిపోతే సరిచేయాలి.
మీకు తెలివి లేకుంటే మమ్మల్ని అడిగితే చెబుతుండే వాళ్లం కదా
అసెంబ్లీలో తీర్మానం చేయగానే సరిపోదు. అప్రమత్తంగా ఉండాలి
ఇప్పుడేం ఎన్నికలు లేవు.. ఎన్నికల కోసం ఈ సభ పెట్టలేదు
సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన.. అందుకే నాకు గర్జు ఉంటది.
మోదీ మీటర్లు పెట్టమంటే తలకాయ తీసినా పెట్టనని చెప్పిన
మళ్లీ మనమే అధికారంలోకి వస్తం.. కొట్లాడుదాం..
మీ బండారం బయట పెడతం
వరి కి వాళ్లు చెప్పిన బోనస్ ఇయ్యరట
మీ దొంగ మాటలు, నంగనాచి మాటలతో నడిపిస్తామంటే ఊరుకునేది లేదు.
అన్ని రాజకీయ పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిపై ఒత్తిడి తేవాలి
నీ గవర్నమెంట్ తీసేస్తం కేసీఆర్ అని నన్ను కూడా బెదిరించిండ్రు. భయపడలేదు.
మీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకొని పోయిండ్రు.. మీ బీఆర్ఎస్ వచ్చి ఇలా మాట్లాడుతున్నారేమిని ఢిల్లీవాళ్లు అంటున్నరు
ఇప్పుడే కరెంటు ఇట్లా ఉంటే..మార్చి, ఏప్రిల్ లో ఎట్లా ఉంటదో?
చివరి శ్వాస వరకూ పులిలాగా కొట్లాడుతా తప్ప..పిల్లిలాగా ఉండను