mt_logo

కాంగ్రెస్ పతనం మొదలు.. జన్మలో కాంగ్రెస్‌కు ఓటు వేయం: సీఎంకు లేఖ రాసిన నిరుద్యోగులు

డీఎస్సీ పరీక్ష వాయిదా వెయ్యాలని, గ్రూప్స్ పరీక్షల్లో పోస్టులు పెంచాలని భారీ ఎత్తున నిరుద్యోగులు పోరాటం చేసినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇతర ప్రజా ప్రతినిధులకు బహిరంగ లేఖ రాసిన నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు.

లేఖ యధాతధంగా 👇🏼

శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు నమసరించి తెలియజేయునది..

మేము డీఎస్‌ డీఎస్సీ స్టూడెంట్స్‌. గత నెల రోజులుగా డీఎస్సీ పోస్ట్‌పోన్‌ గురించి రోడ్లమీద ధర్నాలు చేయడం జరుగుతున్నది. మీరు ఇంతవరకు స్పందించడం లేదు. పైగా మా వెనుక బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారని చెప్తున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అందరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరినంక ఎవరు మాకు సపోర్ట్‌గా ఉన్నది? మీరు దాటవేయడానికి చెప్పే ముచ్చటని అర్థమవుతున్నది. పోస్టులు అమ్ముకున్నారు అంటున్నారు.

అది ఎంతవరకు నిజమో మీకే తెలియాలి. పరీక్ష పోస్ట్‌పోన్‌ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేమిటో మాకు అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాం. రెండు లక్షల తొంభై వేల మంది డీఎస్సీ రాస్తున్నారు. మీరు 11 వేల పోస్టులు వేశారు. రెండు లక్షల తొంభై వేల మందిలో 11 వేల మంది మాత్రమే జాబులు కొడతారు. మిగతా నిరుద్యోగులు మీ కాంగ్రెస్‌ పతనానికి కారకులవుతారు గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్‌ మీరు జరపాలని ఫిక్స్‌ అయ్యారని, పోస్ట్‌పోన్‌ చేయరని మాకు అర్థమవుతున్నది. నీకు, కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్‌ నాయకులారా.. సర్పంచ్‌ ఎలక్షన్లు ఉన్నాయి. ఎంపీటీసీ ఉంది.. జడ్పీటీసీ ఎన్నికలున్నాయి. ఏ కాంగ్రెస్‌ నాయకుడికీ ఓటు వేయం.

అడుగడుగునా మీకు అడ్డుపడుతం. ఒకొక స్టూడెంట్‌ తలుచుకుంటే ఏమి జరుగుతుందో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి త్వరలోనే అర్థమవుతుంది. నిరుద్యోగులు రోడ్లమీద తిరుగుతుంటే సిగ్గు లేకుండా నవ్వుతూ ఫోన్లో ముచ్చట్లు చెప్తున్నారు. మీలాంటి నాయకులను ఎనుకున్నందుకు మమ్మల్ని మేము కొట్టుకోవాలి. ఇక నుంచి చూడండి. మా ఆత్మసాక్షిగా చెబుతున్నాం. జన్మలో కాంగ్రెస్‌కు ఓటు వేయం. మా తల్లిదండ్రులను, మా చుట్టాలను, అన్నదమ్ములను కలిసి ప్రతి ఒకరికీ చెప్తాం. కాంగ్రెస్‌కు ఓటేస్తే కలిగే నష్టాలపై ప్రచారం చేస్తాం. మామీద పోలీసులుచేసిన దాడిపై, మా అన్నదమ్ములు అకాచెల్లెళ్లంతా కలిసి రోడ్లమీద చేసిన ధర్నాలకు, ఆందోళనలకు మీరు స్పందించలేకపోయారు. ఖబడ్దార్‌ రేవంత్‌రెడ్డీ.. గుర్తుపెట్టుకో..! నీ పతనం మొదలైంది.

మేము కాంగ్రెస్‌ వస్తే బాగుపడ్తం అనుకున్నం. చదువుకునే టైం ఇస్తలేరంటే రానురాను మా పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది.నువ్వు డబ్బులే పంచుకో ఏమన్నా చేసుకో..! ఎలక్షన్ల ఎవ్వరం నీకు ఓటు వెయ్యం. కాంగ్రెస్‌కు ఓటేయనియ్యం. మేము ఇంతవరకు ఏ పార్టీ శ్రేణుల దగ్గరికి పోలేదు. మద్దతు ఇవ్వాలని కూడా అడగలేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ న్యాయం చేస్తదని నమ్మినం. కానీ మీలాంటి మూర్ఖులను ఎన్నుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. డీఎస్సీ పోస్ట్‌పోన్‌ చేస్తేనే లెక. లేకపోతే నీ పతనం మొదలైంది చూసుకోండి.

– మీ తెలంగాణ పౌరులైన నిరుద్యోగులు.. డీఎస్సీ అభ్యర్థులు