శాసనసభలో ప్రశ్నోత్తరరాల సమయంలో భాగంగా దేవాదాయ శాఖకు నిధుల మంజూరు అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఆలయాల్లో ధూప దీప, నైవేద్యాలకు ఎటువంటి లోటూ రాకుండా చూస్తున్నామని అన్నారు. టీటీడీ నుండి రాష్ట్రానికి రూ. 241 కోట్లు రావాల్సి ఉందని, దేవాదాయ శాఖకు టీటీడీ బకాయి పడిందని హరీష్ పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన డబ్బు పంచాలని, ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, వచ్చే బడ్జెట్ లో మరిన్ని నిధులు దేవాదాయ శాఖకు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.