అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఎప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్న సందర్భంగా అమెరికాలొ ఉన్న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో (Address 16551 NE 79th St Redmond, WA, 6pm -9 pm) తె.రా.స అభిమానులు, విద్యావంతులు, మేధావులు అందరూ ఎప్రిల్ 27న పార్టీ వార్షికొత్సవ సభను ఎన్.ఆర్.ఐ టీఆర్ఎస్ విభాగం తరపున జరుపుకునెందుకు పిలుపునిచ్చారు.
2001లో పిడికెడు మందితో పార్టీని పెట్టి అతి పెద్ద ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను మెప్పించి, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అతి కీలకమైన పాత్ర పోషించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరియు పార్టీ అధినేత కే.సీ.ఆర్ గారిని ఈ సంధర్బంగా ఎన్.ఆర్.ఐ టీఆర్ఎస్ విభాగం తమ హ్రుదయపూర్వక క్రుతజ్ఞతలు తెలుపుతుంది.
కే.సీ.ఆర్ సారధ్యంలో పార్టీ కోసం, రాష్ట్ర సాధన కోసం కృషి చెసిన అనేక మంది సామాన్య కార్యకర్తల పిల్లలు ఈరోజు పలు దేశాల్లో ఉన్నత ఉద్యొగాలు చేస్తున్న, తమ తమ తల్లితండ్రుల కష్ట ఫలితంగా ఏర్పడ్డ ఈ రాష్ట్రం అభివృద్దికి నిర్మాణాత్మక సలహాలు అంధిచాలని నిర్ణయం తీసుకున్నారు.
27న జరిగే సమావేశంలో పార్టీ ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగిరథ, ఆసరా, కల్యాణ లక్ష్మీ, కేజి టూ పీజి లాంటి అనేక పథకాల పై కూడ చర్చ జరగనుంది. ఎటువంటి రాజాకీయ నాయకుల ప్రసంగాలు లేకుండా పూర్తిగా స్థానిక టీఆర్ఎస్ అభిమానులు తమ తమ అనుభవాలను, తమ భవిష్యత్ కార్యక్రమాలను మిత్రులతో పంచుకోనున్నారు.
సియాటెల్ నగరం మరియు చుట్టుపక్కల ఉన్న ఇతర నగరాల్లొ ఉన్న టీఆర్ఎస్ అభిమానులను, మేధావులను ఈ సంధర్భంగా ఎన్.ఆర్.ఐ టీఆర్ఎస్ ఆహ్వనం పలుకుతుంది.