mt_logo

ఎన్నారై టి.ఆర్.యస్ – ఆస్ట్రేలియా శాఖ ఇన్‌ఛార్జ్ గా అనిల్ బైరెడ్డి

– జూన్ మొదటి వారంలో ఎంపీ కవిత గారిచే ఆస్ట్రేలియాలో ప్రారంభం

టి.ఆర్.యస్ పార్టీ అధికారిక ఆస్ట్రేలియా ఎన్నారై శాఖ “ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – ఆస్ట్రేలియా” ఇన్‌ఛార్జ్ గా అనిల్ బైరెడ్డి బాద్యతలు నిర్వహిస్తారని ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

ఆస్ట్రేలియా ఇన్‌ఛార్జ్ అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ… గతంలో వివిధ దేశాల్లో ఎలాగైతే పార్టీ అధికారిక శాఖలు నిర్వహించారో, అలాగే ఆస్ట్రేలియాలో సైతం ఎంపీ కవిత గారి ఆద్వర్యంలో జూన్ మొదటి వారంలో ఘనంగా ఆవిర్భావ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నారై టి.ఆర్.యస్ ఆస్ట్రేలియా శాఖ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన తరువాత, ప్రవాస తెలంగాణ బిడ్డల నుండి ఊహించని స్పందన వచ్చిందని, ఇదంతా కే.సీ.ఆర్ గారి అద్భుతమైన పాలనకు వస్తున్న స్పందనని, ప్రతి ఒక్కరు కే.సీ.ఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడానికి వందలాదిగా ముందుకు వస్తున్నారని, ఐతే క్రియాశీలకంగా పని చేసే సబ్యులతో జాతీయ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని వాటి వివరాలు తెలిపారు.

ఎన్నారై టి.ఆర్.యస్ – ఆస్ట్రేలియా శాఖ ఇన్‌ఛార్జ్ – అనిల్ బైరెడ్డి
అధికార ప్రతినిధి: డా. అనిల్ రావు చీటీ, నాగేందర్ కాసర్ల
జాతీయ కోర్ కమిటీ సబ్యులు: చంద్రశేఖర్ మోరంపూడి, విన్నితుముకుంట, రాజు వీర్, శ్రీనివాస్ చింతల, రాజేష్ రాపోలు, ప్రకాష్ సూరపనేని, శ్రీనివాస్ కర్ర, మధు పైళ్ళ, కిరణ్ పాల్వై, చెన్న కేశవ్
ఐటి సెక్రెటరీ: రోహిత్ రెడ్డి
మీడీయా సెక్రెటరీ: అర్జున్ సీ.హెచ్
విక్టోరియా స్టేట్ కో- ఆర్డినేటర్లు: కిశోరె నక్క, సాయిరామ్ ఉప్పుట్రా,సనిల్ బాసీరెడ్డి
న్యూ సౌత్ వేల్స్ స్టేట్ కో- ఆర్డినేటర్లు: మహేష్ గుర్రాల, జశ్వంత్ కొడరపు, వేణు
క్వీన్స్ లాండ్ స్టేట్ కో- ఆర్డినేటర్లు: శ్రీధర్ బచనబోవ, శ్రీ గుజ్జురు
కాన్‌బెర్రా కో- ఆర్డినేటర్: శ్రీధర్ రెడ్డి కాల్వ

ఇతర కమిటీ సబ్యులు:
దినేష్ నేవురి,విజయ్ రెడ్డి మారాం, వంశీ కొట్టాల, మధు ప్రాస, జగన్, సాంబశివ రెడ్డి, అశ్వంత్ గౌరీషెట్టి, పవన్, సుధాకర్, భార్గవ కాదారి, సందీప్ ఆలేది, వినయ్ కుమార్ నైనీ.

నేటి వరకు ఆస్ట్రేలియా గడ్డ పై మెడలో గులాబీ కండువా లేకుండా టి.ఆర్.యస్ పార్టీ – కే.సీ.ఆర్ గారి అభిమానులుగా వారి వెంట ఉన్నామని, ఇక నేటి నుండి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా, ప్రవాస తెలంగాణ బిడ్డలకు(సంస్థలకు) – పార్టీ కి/ప్రభుత్వానికి వారధులుగా పని చేస్తామని, అందరినీ కలుపుకొని ముందుకు పోతామని, మాకు ఈ అవకాశం కల్పించిన కే.సీ.ఆర్ గారికి, ప్రత్యేకించి మా అభ్యర్ధనను మన్నించి మమ్మల్ని ప్రోత్సహించిన ఎంపీ కవిత గారికి, మరియు యావత్ టి.ఆర్.యస్ పార్టీ నాయకులకు – క్షేత్రస్థాయి కార్యకర్తలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై టి.ఆర్.యస్ ప్రతినిధులకు, ముఖ్యంగా ఎన్నారై టి.ఆర్.యస్ – అమెరికా నాయకుడు మహేష్ తన్నీరు గారికి ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – ఆస్ట్రేలియా శాఖ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *