mt_logo

మానవ మనుగడకు వీటి ప్రాధాన్యత అధికం : రామగుండం సీ. పి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటినరామగుండం సి పి (డి .ఐ .జి)రెమరాజేశ్వరి. రూ 38. 50 కోట్ల వ్యయంతో నిర్మించిన రామగుండం కమిషనరేట్ పోలీస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఏఆర్ ,సివిల్ పోలీసులు నూతన కార్యాలయ ఆవరణలోని గ్రౌండ్లో సోమవారం ఆరు వందల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రెమరాజేశ్వరి మాట్లాడుతూ. మానవ మనుగడకు చెట్లు ఎంతో ప్రాధాన్యమైనవని అన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ వారి ఇంటి ఆవరణలో రెండు మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు.