mt_logo

‘కేసీఆర్ కానుక’ కు దరఖాస్తుల చివరి తేదీ రేపే

నిరుపేద మైనార్టీ మహిళలు ఎవరి మీద ఆధారపడకూడదనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ వారికీ  స్వయం ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్‌ కానుక’ పేరిట 20 వేల కుట్టుమిషన్లు అందజేయనున్న విషయం తేలిందే. అయితే ఈ పథకం దరఖాస్తులకు రేపటితో గడువు ముగియనున్నది. శిక్షణ ఇప్పించటంతో పాటు, కుట్టుమిషన్లను ఉచితంగా అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయము విదితదమే.. మైనారిటీలందరికీ 18 వేలు, క్రిస్టియన్‌ మైనారిటీలకు 2 వేల కుట్టుమిషన్లు అందించనున్నట్టు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది.  21-55 ఏండ్ల వయసు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం లేదా తెల్లరేషన్‌ కార్డు కలిగిన మైనారిటీ మహిళలు అర్హులు.  ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హతలు, పాస్‌పోర్ట్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం అధికారులను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఒంటరి, వితంతు, విడాకులు పొందిన, నిరుపేద మహిళలకు తొలి ప్రాధాన్యం అని గతంలోనే తెలిపారు.